Haan main baap banne wala hoon: Shahid Kapoor confirms Mira Rajput's pregnancy

I am going to be a dad soon confirms shahid kapoor

shahid kapoor, mira rajput, shahid kapoor and mira rajput, mira rajput pregnant, shahid kapoor and mira rajput together, shahid kapoor and mira rajput child, shahid kapoor and mira rajput photos, mira rajput expecting, shahid kapoor and mira rajput first child

Shahid Kapoor and Mira Rajput expecting their first child became the talk of the town after the gossip mills started churning out stories on the same

ఔను.. నేను తండ్రిని కాబోతున్నాను: షాహిద్ కపూర్

Posted: 04/17/2016 04:39 PM IST
I am going to be a dad soon confirms shahid kapoor

తండ్రి కావడం ఎవరికైనా గొప్ప అనుభూతి. వెలకట్టలేని సంతోషం. అదే సంతోషంలో తాను మునిగి తేలుతున్నట్టు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్‌ తెలిపాడు. 'హా మే బాప్ బాన్నే వాలా హూ'  (అవును.. నేను తండ్రిని కాబోతున్నాను) అని అతను వెల్లడించాడు. షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు త్వరలోనే తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. మీరా రాజ్‌పుత్ గర్భవతి అయినట్టు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాలు వెలువడ్డాయి.

ఈ కథనాలపై ఇంతవరకు షాహిద్ కపూర్ ఎక్కడా స్పందించలేదు. అతని తాజా చిత్రం 'ఉడ్తా పంజాబ్‌' ట్రైలర్ విడుదల సందర్భంగా విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాగా నేరుగా కాకుండా పరోక్షంగా ప్రశ్నలు కురిపించారు. దీనిపై స్పందించిన షాహీద్.. 'ఎందుకండి.. డొంక తిరుగుడు ప్రశ్నలు అడుగుతారు. డైరెక్టుగా అడగండి. అవును.. నేను నాన్నను కాబోతున్నాను' అంటూ తేల్చాశాడు షాహిద్‌. నిజంగా ఈ వార్త షాహిద్, మీరా అభిమానులకు ఆనందం కలిగించేదే. అందులోనూ తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్న ఫీలింగ్ కు ఏ జంటకు మాత్రం తీపి కబరు కాదంటారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Kapoor  Mira Rajput  udta punjab  media  bollywood  

Other Articles