anjali turns down bala-krishna 100th movie heroine offer

Balakrishna mind blanks as anjali turns down his offer

balakrishna, balakrishna 100th movie, balakrishna 100 movie heroine, balaiah 100th movie, balaiah movie Gautamiputra Satakarni, Gautamiputra Satakarni herione, anjali rejects balaiah offer, nayantara, tamanna, anjali latest movies, anjali news, tamanna news, nayantara latest news

after nayantara and tamannah, the new hope of balakrishna Miss Anjali also turned down his 100th movie heroine offer in gautamiputra satakarni.

బాలయ్య శతకర్ణిలో హీరోయిన్ ఎవరు..? మైండ్ బ్లాంక్ చేసిన అంజలి..?

Posted: 04/17/2016 05:23 PM IST
Balakrishna mind blanks as anjali turns down his offer

నందమూరి నట సింహం బాలకృష్ణ తన వారసుడ్ని పరిచయం చేయిస్తున్న తన నూరవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలయ్యకు హీరోయిన్ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఆ సినిమాలో హీరోయిన్ల పాత్ర నచ్చకపోవడమో లేక ఇటీవల ఆయన హీరోయిన్లపై చేసిన కామెంట్ల కారణంగానే కానీ ఆయన 100వ చిత్రంలో నటించడానికి హీరోయిన్లు ఎవరు ముందుకు రావడం లేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా బాలయ్య 100 చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ ధర్శకుడు క్రిష్ కు హీరోయిన్ల ఎంపిక మాత్రం శరాఘాతంలా పరిణమించింది.

వచ్చే నెలలో సెట్ల మీదకు వెళ్లాల్సిన సినిమాలో బాలయ్య సరసన నటించేందుకు ఇప్పటి వరుకు ఆయన పక్కన నటించిన హీరోయిన్లు అంగీకారం చెప్పక పోవడంతో.. క్రిష్ ఇబ్బందులు పెడుతున్నాయట. ఇక ఈ సమస్యను అధిగమించేందుకు క్రిష్ ఏకంగా బాలీవుడ్ నటీమణులను కూడా సంప్రదించే పనిలో వున్నారని సమాచారం. ముందుగా తన సరసన అన్ని విధాలుగా సూట్ అవుతుందనుకుని స్వయంగా బాలయ్యే నయనతారను అడిగినా, వేరే చిత్రంలో నటిస్తున్న తనకు నటించేందుకు కుదరదని చెప్పిందట,

ఇక మిల్కీ బ్యూటీని సీనిమా నిర్మాణ రంగం వారు సంప్రదించగా, బాలయ్య పక్కన తనను ఊహించుకునేందుకే బాగోదంటూ తమన్నా నో చెప్పేసిందట, ఈ నేపథ్యంలో నటి అంజలిని వెతుక్కుంటూ వెళ్లిన సినీమా నిర్మాత దర్శకులకు అక్కడ కూడా ఊహించన పరిణామం ఎదురైంది. అంజలి స్టోరీ అంతా విని.. హీరోయిన్ గా ఓకే కానీ ఇద్దరు పిల్లలకు తల్లిగా తాను నటించడానికి ఇష్టపడలేదట, కథలో ఎక్కువ భాగం తనకు రాచరికపు టచ్ వుందే తప్ప హీరోతో  ఎలాంటి డ్యూయెట్లు లేవని తెలియడంతో అమె కూడా విముఖత వ్యక్తం చేసిందని టాక్.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరనన నటించే నటి కోసం దర్శకుడు క్రిష్ ఏకంగా బాలీవుడ్ బాట పట్టారని టాక్. అయితే గౌతమీ పుత్ర శాతకర్ణీ భార్య పాత్రలో నటించేందుకు ఎవరిని ఎంపిక చేస్తారో, ఎవరు ముందుకు వస్తారో వేచి చూడాల్సిందే. ఇదిలావుండగా, బాలయ్య సరసన హీరోయిన్ గా నటించేందుకు గత కొన్నేళ్లుగా సమస్యలు ఉత్పన్నమవుతున్నా.. వాటిని నయనతార పరిష్కరించింది, ఇక ఆ తరువాత అమె తమిళనాట బిజీ కావడంతో మళ్లీ అదే సమస్య ఉత్పన్నంకాగా, అంజలితో పరిష్కారం లభించిందని బావిస్తున్న తరుణంలోనే అమె కూడా విముఖత వ్యక్తం చేయడంతో బాలయ్య మైండ్ బ్లాంక్ అయ్యందన్న టాక్ వినబడుతుంది.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautamiputra Satakarni  balakrishna  nayantara  tamanna  anjali  

Other Articles