Baaghi | Trailer | Tiger Shroff | Shraddha Kapoor | Stills

Baaghi cham cham song video

Baaghi Cham Cham Video, Baaghi Trailer, Baaghi stills, Baaghi movie trailer, Tiger Shroff Baaghi trailer, Baaghi movie updates, Baaghi release date, Baaghi

Baaghi Cham Cham Song Video: Presenting Cham Cham Video Song from upcoming movie BAAGHI directed by Sabbir Khan, starring Tiger Shroff & Shraddha Kapoor in lead roles. The song Cham Cham is sung by Monali Thakur in the music composition of Meet Bros and lyrics by Kumaar. The film releases on April 29, 2016.

వర్షంలో చమ్ చమ్ అంటున్న ‘భాగీ’ జంట

Posted: 04/08/2016 09:51 AM IST
Baaghi cham cham song video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జంటగా శోభన్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘వర్షం’. మ్యూజికల్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఇందులో ‘వర్షం’ సాంగ్ ఇప్పటికీ మారుమ్రోగుతూనే వుంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని ప్రస్తుతం హిందీలో ‘భాగీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

కేవలం స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని... హిందీలో పూర్తిగా మార్చేసి ‘భాగీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, క్యూట్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘భాగీ’. యూటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సాజిద్ నడియడ్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా ఇందులో ‘చమ్ చమ్...’ అనే పాట టీజర్ ను విడుదల చేసారు. పూర్తి లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో శ్రద్ధాకపూర్ గ్లామర్ అందాల ఆరబోత భారీగానే చేసింది. ఇక టైగర్ చేసిన యాక్షన్ సీన్లు హైలెట్ కానున్నాయి. నెగెటివ్ పాత్రలో సుధీర్ బాబు సరిగ్గా సరిపోయారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baaghi  Cham Cham Video  Trailer  Tiger Shroff  Shraddha Kapoor  Sudheer Babu  stills  

Other Articles