Who Is pawan kalyan

Who is pawan kalyan

pawan Kalyan, Power Star Pawan Kalyan, Sardar, Sardar Gabbar SIngh, Sardar Gabbar SIngh mania, Sardar Gabbar Singh craze, Pawan kalyan fans

Powerstar Pawan Kalyan is known for sporting different looks during the breaks between his films.We have seen him with tonsured head, full grown beard, short hairdo and with handlebar moustache and all. Pawan Kalyan is currently relaxing as he done with the hectic shooting schedules of Sardaar Gabbar Singh.

పవన్ కళ్యాణ్ అంటే ఎవరు.? ప్రశ్నించిన యాంకర్

Posted: 04/07/2016 04:32 PM IST
Who is pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికి తెలుసు. ఆయన తాజాగా తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ రేపు ఉగాది సందర్భంగా విడుదలకానుంది. ఎక్కడ చూసినా సర్దార్ గబ్బర్ సింగ్ మానియానే నడుస్తోంది. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. హిందీలో మొదటిసారి పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే బాలీవుడ్ లో చేస్తున్నది మొదటి సినిమానే అయినా కూడా అక్కడి జనాలు ఈ సినిమా మీద బాగా అంచనాలు పెట్టుకున్నారు. అక్కడి ఫిల్మ్ క్రిటిక్స్ పవన్ కళ్యాణ్ ఇంటర్య్వూ కోసం ఎగబడుతున్నారు. తాజాగా ఆయనను ఇంటర్వ్యూ సిఎన్ఎన్ ఐబీఎన్ లో ఈ సాయంత్రం ప్రసారం కానుంది.

Also Read: బాలీవుడ్ జర్నలిస్ట్ కు ‘సర్దార్’ స్పెషల్ గిఫ్ట్ 

సీఎన్ఎన్ ఐబీఎన్ ఛానల్ యాంకర్, సినిమా క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూ చేశాడు. మొన్నటి దాకా సర్దార్ కోసం హడావిడి చేసినా ఆ షూటింగ్ కు అంతా సిద్దం కావడంతో తన పొలంలో ప్రశాంతంగా సేద తీరుతున్నారు. పూర్తిగా మీసం తీసి.. కొత్త లుక్ లో కనిపించారు. కూల్ గా సినిమాలు అంటే ఏమిటో కూడా తెలియనంత ప్రశాంతంగా, అమాయకంగా కనిపించారు పవన్ కళ్యాణ్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ కోసం అభిమానులు మాత్రం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో సర్దార్ గబ్బర్ సింగ్ ఎలా స్పందిస్తాడో తెలుసుకోవాలనే.. రాజీవ్ మసంద్ ఇంటర్వ్యూ చేశాడు. అది ఈ సాయంత్రం ప్రసారం కానుంది.

రాజీవ్ మసంద్ అడిగిన కొన్ని ప్రశ్నలు..
* నిజమైన పవన్ కల్యాణ్ ఎవరు..? ఓ యాక్టర్..? ఓ రైతు..? జనసేన పార్టీకి అధినేత.? ఎవరు ఇంతకీ..?
* ఓ పక్క రేపు సినిమా రిలీజ్ అవుంటే మీరు మాత్రం ప్రశాంతంగా పొలంలో కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు..? అసలు మీ నమ్మకం ఏంటి.? సినిమా హిట్ అవుతుందని నమ్మకమా..? లేదంటే సినిమాను ప్రజలే నిర్ణయిస్తారని అనుకుంటున్నారా..?

ఇలా రాజీవ్ మసంద్ అడిగిన ప్రశ్నలకు మనస్సు విప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాలను చెప్పాలంటే ఈ రాత్రికి 6.30గంటలకు సీఎన్ఎన్ ఐబీఎన్ లో వచ్చే ఇంటర్వ్యూ చూడండి.

Also Read: పవన్ కళ్యాణ్ తో అనుపమ చోప్రా ఇంటర్య్వూ 

అక్కడ ఇక్కడ అని తేడాలో లేదు. అన్ని చోట్లా పవర్ స్టార్ ప్రభంజనమే అన్నట్లుంది పరిస్థితి. మామూలుగా మాస్ సినిమాల మీద ఓవర్సీస్ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరన్న అభిప్రాయం ఉంది. కానీ పవన్ విషయంలో మాత్రం దానికి మినహాయింపు ఇవ్వాల్సిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా మీద ఓవర్సీస్ లో ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ఒక్క యుఎస్ టెరిటరీలోనే 200కు పైగా స్క్రీన్లలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హల్ చల్ చేయబోతోంది. ఒక్క ‘బాహుబలి’కి మాత్రమే ఇంతకంటే ఎక్కువ స్క్రీన్లు ఇచ్చారక్కడ. ఇక ప్రిమయర్ షోల విషయానికి వస్తే ‘బాహుబలి’ని కూడా వెనక్కి నెట్టేయబోతోంది సర్దార్.

300కు పైగా ప్రిమియర్ షోలు పడబోతున్నట్లు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఐడ్రీమ్స్ సంస్థ చెబుతోంది. రెండు రోజుల ముందే డ్రైవ్స్ అన్నీ డిస్పాచ్ అయిపోయాయని.. విడుదలకు ముందు రోజు భారత కాలమానం ప్రకారం 4 గంటలకే కొన్ని లొకేషన్లలో ఫస్ట్ ప్రిమియర్ షో పడే అవకాశముందని చెబుతోందా సంస్థ. ప్రిమియర్ షోల టికెట్ ధర కనీసం 35 డాలర్ల దాకా ఉంటోంది. అయినప్పటికీ అభిమానులు ఏమాత్రం తగ్గట్లేదు. ప్రిమియర్ షోల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే 15 లొకేషన్లలో టికెట్లు అయిపోవడం విశేషం. యుఎస్ తో పాటు మొత్తం 43 దేశాల్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలవుతోంది. బాహుబలి కూడా ఇన్ని దేశాల్లో రిలీజవ్వలేదు. ఇది టాలీవుడ్ రికార్డు. ఈ 43లో 23 దేశాల్లో తెలుగు సినిమా రిలీజవ్వడం తొలిసారి కావడం విశేషం.

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టికెట్ల కోసం ఎంతైనా పెట్టేందుకు అభిమానులు అస్సలు వెనుకాడటం లేదు. ఓ పవన్ అభిమాని ఏకంగా ఐదు వేల రూపాయల చొప్పున రెండు టికెట్లకు పది వేల రూపాయలు పెట్టాడు. అయినా పవన్ మీద ఉన్న అభిమానం ముందు టికెట్ డబ్బులు పెద్ద లెక్క కానేకాదు.

(Tickets Photo from Kiran)

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles