స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో అత్యంతభారీగా నిర్మించిన సరైనోడు చిత్రం ఆడియో ఏప్రిల్ 1న విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది. ఇదిలా వుండగా ఏప్రిల్ 10న విశాఖపట్నం లో అత్యంత భారీగా ఆర్.కె బీచ్ లో దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో పూర్తి ఎల్.ఇ.డి స్క్రీన్స్ తో మొట్టమొదటి సారిగా ఆడియో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సందర్బంగా తాజాగా మీడియా సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్, ఆంద్రప్రదేశ్ మంత్రి వర్యులు గంటా శ్రీనివాసరావు గారు హజరయ్యారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. చాలా కాలం నుండి గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్ లో ఏదైనా పెద్ద సినిమా ఫంక్షన్ చేయాలని కొరుతున్నారు. అలాగే అల్లు అర్జున్ కి అన్ని ఏరియాల కంటే వైజాగ్ లో మంచి మార్కెట్ వుంది. బన్ని కి వైజాగ్ తొ మంచి అనుభందం వుంది. కొత్త ఆంధ్రప్రదేశ్ లో ఇదే అతి పెద్ద ఫంక్షన్ గా వుండబోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హజరవుతున్నారు. బన్ని, ముగ్గురు హీరోయిన్స్ హజరవుతున్నారు. అలాగే మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఫెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు. ఇంకా చాలా టాలెంట్డ్ షో లు చేస్తున్నాము. ఆంద్రప్రదేశ్ లో కూడా ఇలాంటి పెద్ద ఫంక్షన్స్ జరగటానికి, అలాగే షూటింగ్స్ కూడా జరగటానికి అన్ని విధాల సహయసహకారాలు అందిస్తాము. మా సరైనోడు చిత్రం ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 10న ఆడియో సెలబ్రేషన్స్ జరుపుతున్నాము.అని అన్నారు.
మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మేము ఎప్పటినుండో ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా షూటింగ్ లు జరగాలని, ఇక్కడ కూడా పరిశ్రమ స్థిరపడాలని కోరుకుంటున్నాము. ఇప్పటికిప్పుడే అది కుదరకపోయినా పెద్ద చిత్రాల షూటింగ్స్, ఈవెంట్స్ ఇక్కడ జరిగాలని కోరుకున్నాము. దీని కోసం చిరంజీవి గారిని ఇతర హీరోల్ని కూడా సంప్రదించటం జరిగింది. హీరోల కో-ఆపరేషన్ లేకుంటే అది సాధ్యపడదు. అల్లు అర్జున్ సరైనోడు ఫంక్షన్ ఇంత భారీగా చేస్తున్నందుకు చాలా దన్యవాదాలు. తనకి వైజాగ్ అంటే చాలా ఇష్టమని ఇక్కడ స్టూడియో కట్టాలనుకుంటున్నాను అని చెప్పారు. అలాగే రామ్ చరణ్ , నందమూరి బాలకృష్ణ కూడా స్టూడియో కట్టాలనే ఆలోచన వున్నట్టు చెప్పారు. హైదరాబాద్ లో జరిగినట్టు ఐఫా అవార్డు ఫంక్షన్ లు ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నాము. సినిమా ఫంక్షన్స్ , షూటింగ్స్ కి పర్మిషన్స్ సింగిల్ విండో పద్దతిలో ఇచ్చేస్తామని. సినిమా ఇండస్ట్రికి ఎటువంటి సహయాన్నైనా అందిస్తాము. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న మెగా హీరోలందరికి, అభిమానులకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము.. అని అన్నారు.
నటీనటులు అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో) తదితరులు. సాంకేతికవర్గం.... బ్యానర్ - గీతా ఆర్ట్స్; ప్రొడక్షన్ కంట్రోలర్స్ - బాబు, యోగానంద్; చీఫ్ కోఆర్డినేటర్ - కుర్రా రంగారావ్; ఫైట్ మాస్టర్స్ - రామ్ లక్ష్మణ్, రవి వర్మ; పాటలు: రామ జోగయ్య శాస్త్రి , అనంత్ శ్రీరాం, క్రిష్ణ చైతన్య, శ్రీమణి; కొరియోగ్రఫి: దినేష్, జాని, బాస్కో సీజర్, శేఖర్, గణెష్ ఆచార్య, భాను; మీడియా రిలేషన్స్ -ఎస్.కె.ఎన్ & ఏలూరు శ్రీను; ఆర్ట్ డైరెక్టర్ - సాహి సురేష్; ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్; ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్; డిఓపి - రిషి పంజాబి; డైలాగ్స్ - ఎం.రత్నం; మ్యూజిక్ - ఎస్ ఎస్ తమన్; కో ప్రొడ్యూసర్ - శానం నాగ అశోక్ కుమార్; ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్; డైరెక్టర్ - బోయపాటి శ్రీను.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more