Sardaar Gabbar Singh | Pawan Kalyan | Record Creates | Theaters List | Online Booking

Sardaar gabbar singh theaters list

Sardaar Gabbar Singh Record Creates in US, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online bookings, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh bookings, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh benfit shows, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh videos, Sardaar Gabbar Singh overseas rights, Sardaar Gabbar Singh records, Sardaar Gabbar Singh songs, Pawan kalyan

Sardaar Gabbar Singh theaters list: Powerstar Pawankalyan Sardaar Gabbar Singh film will be release on 8 April 2016. Bobby director, DSP music, Kajal heroine.

రికార్డుల మోతకు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సిద్ధం

Posted: 04/02/2016 04:20 PM IST
Sardaar gabbar singh theaters list

తెలుగు సినీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. సౌత్ ఇండియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరూ ఊహించని రేంజులో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. పైగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతుండటంతో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు ఎవరినోట విన్నా కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. చివరకు పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’పై రకరకాల చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి అందరినోట ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మారుమ్రోగిపోతున్నాడు. ఇక సెన్సార్ పూర్తయిన క్షణం నుంచి టికెట్ల బుకింగ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంకా ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడుతున్నారు. అయినా పట్టువదలని విక్రమార్కులుగా అభిమానులు ప్రయత్నాలు మానుకోవట్లేదు.

ఇదిలా వుంటే అభిమానుల అంచనాలను మరింత పెంచేలా.. అందరికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అందుబాటులో వుండే విధంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అమెరికాలో తెలుగు సినిమాలు 100 థియేటర్లలోపే విడుదలవుతాయి. కానీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను మాత్రం ఏకంగా 188 థియేటర్లలో విడుదల చేయనున్నారు. అలాగే ఓవర్సీస్ మొత్తంలో 42 దేశాల్లో 400కు పైగా థియేటర్లలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తెలుగుతో పాటు హిందీలో కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదల కానుంది. బాలీవుడ్ లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని 800 స్ర్కీన్లలో విడుదల చేయడానికి ఈరోస్ సంస్థ ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ లో కూడా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వేడి భారీగానే వుంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దెబ్బకు హిందీలో ఎలాంటి చిత్రాలు కూడా విడుదలవ్వడానికి ధైర్యం చేయట్లేదు. ఇప్పటికే విడుదలై ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ట్రైలర్ హిందీలో సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ జనాలు సైతం ఈ సినిమా రాక కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక తెలుగులో ‘సర్దార్’కు పోటీగా మరో సినిమా రావడానికి ఎవరూ సాహసం చేయడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1400 థియేటర్లలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో బెన్ ఫిట్ షోలను కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ హంగామా అంతా చూస్తుంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తొలిరోజు వసూళ్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరుగనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  Pawan kalyan  Theaters list  Online booking  Posters  

Other Articles