Vijay | Theri | Audio Release Date | Pawan kalyan | Sardaar Gabbarsingh

Theri audio on 20 march

Vijay Theri Audio Release Date, Vijay Theri Trailer, Theri Teaser, Vijay Theri Posters, Vijay Theri stills, Vijay Theri movie news, Vijay Theri movie updates, Vijay Theri movie details, Vijay Theri shooting details, Vijay Theri

Theri Audio on 20 March: Vijay's latest film with director Atlee, Theri is directed by Atlee and stars Vijay with actresses Samantha and Amy Jackson in lead roles.

మార్చి20న పవర్ స్టార్, ఇళయథలపతిల ఆడియో సందడి

Posted: 03/15/2016 12:02 PM IST
Theri audio on 20 march

మార్చి 20న తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల సందడితో మారుమ్రోగనున్నాయి. ఆ స్టార్ హీరోలు ఎవరంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇళయథలపతి విజయ్. తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 20న గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా వుంటే తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోలలో విజయ్ ఒకరు.

విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘థేరి’. ‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతునన్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మార్చి 20న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో విజయ్ రెండు విభిన్న పాత్రలో నటిస్తున్నాడు. ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా.. మరొకటి చిన్నపిల్లాడి మనస్తత్వం కలిగిన పాత్రగా కనిపిస్తోంది. రెండు గెటప్ లలో విజయ్ యాక్టింగ్ అదుర్స్ అనిపించేలా వున్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌత్ ఇండియాలో వీరిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ వుంది. మరి మార్చి 20న సౌత్ ఇండియాలోని తెలుగు, తమిళ సినీ అభిమానులకు పండగేనని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Theri  Audio Release Date  Pawan kalyan  Sardaar Gabbarsingh  stills  

Other Articles