Sai Dharam Tej | Powerstar | Pawan kalyan | bodyguard | Sardaar Gabbarsingh

Sai dharam tej turn as pawan kalyan bodyguard

Sai Dharam Tej turn as powerstar bodyguard, Sai Dharam Tej turn as bodyguard, Sai Dharam Tej become bodyguard, Sai Dharam Tej turn as pawan kalyan bodyguard, Pawan kalyan stills, Sardaar Gabbarsingh posters, Sardaar Gabbarsingh videos

Sai Dharam Tej turn as pawan kalyan bodyguard: Powerstar Pawan kalyan latest film Sardaar Gabbarsingh film audio will be release on 20 march. Devisriprasad music, Bobby direction, kajal heroine.

ముద్దుల మామయ్యకు బాడీగార్డ్ గా సుప్రీం హీరో

Posted: 03/15/2016 03:59 PM IST
Sai dharam tej turn as pawan kalyan bodyguard

సౌత్ ఇండియాలో బాగా క్రేజ్ వున్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. అలాంటి పవన్ కళ్యాణ్ కు తన ఫ్యామిలీలోనే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ వున్నారు. అందులో సాయిధరమ్ తేజ ఒకరు. తన మేనమామ పవన్ కళ్యాణ్ అంటే తేజుకి చాలా ఇష్టం. సినీ ఇండస్ట్రీలోకి తేజు రావడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యకారకుడు. ఒకవిధంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ కు తేజు గారాల మేనల్లుడుగా చెప్పుకోవచ్చు.

అలాంటి మేనమామ దగ్గర అల్లరి, సందడి చేయడం మేనల్లుడి పని. కానీ తన వద్ద అలాంటి అల్లరి పనులు చేయకపోయినా.. కాస్త సందడి చేసే అవకాశం మాత్రం ఇస్తుంటాడు పవన్. అలా తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ కు తేజ బాడీగార్డ్ గా మారిపోయి, సందడి చేసాడు.

మావయ్య పవన్ కళ్యాణ్ కు తేజు తన తమ్ముడితో కలిసి బాడీగార్డ్ గా మారిపోయారు. పోలీస్ డ్రెస్ లో వున్న పవన్ కళ్యాణ్ కు తేజు బ్రదర్స్ బాడీగార్డ్స్ గా మారిపోయి కాసేపు సందడి చేసారు. తేజు అల్లరిని పవన్ కళ్యాణ్ కూడా ఆనందించి, ఎంజాయ్ చేసారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యే సరికి మెగా అభిమానులు ఫుల్ జోష్ లో వున్నారు. ఏదేమైనా పవర్ స్టార్ సందడి మళ్లీ మొదలయ్యిందని చెప్పుకోవచ్చు.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో ఈనెల 20న గ్రాండ్ గా విడుదల కానుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbarsingh  Sai Dharam Tej  Pawan Kalyan  Supreme  Posters  

Other Articles