Date fix for Chiranjeevis 150 film opening

Date fix for chiranjeevis 150 film opening

Chiranjeevi, Chiranjeevis 150the Film, CHiranjeevi News, Chiranjeevi New Film, Chiranjeevis New Look, Chiranjeevi Fans, Mega Star CHiranjeevi, Mage Star Fans

Date fix for Chiranjeevis 150 film opening. Mega fans are waiting for Magestar on silver screen. May Mega Fans get clarity on March 27.

చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం ఫిక్స్..!

Posted: 03/09/2016 11:06 AM IST
Date fix for chiranjeevis 150 film opening

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి సినిమా అప్ డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులకు తెర దించేందుకు చిరంజీవి సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. మెగాస్టార్ ను మరోసారి వెండితెర మీద చూడాలని.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు పండగ చేసుకునే టైం దగ్గరపడింది. రామ్ చరణ్ నిర్మాతగా, చిరంజీవిని మరోసారి వెండితెర మీద మెరిపిస్తూ ఆయన 150 సినిమి తొందరలోనే అన్ని అవాంతరాలను తొలగించుకొని ముహూర్తం కుదరనుంది. ఇప్పటికే చిరంజీవి స్లిమ్ గా మారి... అభిమానులకు కన్నుల విందు కలిగించనున్నారు.

చిరంజీవి 150 సినిమా గత కొన్ని నెలలుగా హాట్ హాట్ టాపిక్. ఇప్పటికే చిరు 150 సినిమా ముహర్తం చాలా సార్లు వాయిదా పడింది. కాగా ఈనెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజున తన 150 సినిమాను ప్రకటించాలని చిరు భావిస్తున్నాడు. శ్రీజ పెళ్లి అనంతరం తన సినిమాను సెట్స్ మీదకు తీసుకొని రావాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 27న సినిమా ఓపెనింగ్ కాకపోయినా సినిమా కు సబంధించిన కొన్ని స్టిల్స్ అయినా రిలేజ్ చేయాలని మెగాస్టార్ భావిస్తున్నాడట. అంతేకాదు చెర్రీ పుట్టిన రోజుకి ప్రెస్ నోట్ రిలీజ్ చేసే యోచనలో ఉన్నారనే టాక్ హల్ చల్ చేస్తోంది. దీంతో చిరు 150 సినిమాకు సంబంధించిన ఏదొక అప్డేట్ మార్చ్ 27న బయటకు వస్తుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles