Did Balayya Really Say Sorry?

Did balakrishna really say heartful apology for his sexist comments

balakrishna speech at savitri audio launch, balakrishna apologies for his comments in savitri audio launch, balakrishna about women, balayya funny speeches, balakrishna, savitri audio launch, women's day, apology

film star and Hindupur MLA Nandamuri Balakrishna has finally apologized to those who may have been hurt by his comments.

మహిళలకు బాలయ్య మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడా..?

Posted: 03/08/2016 05:30 PM IST
Did balakrishna really say heartful apology for his sexist comments

తెలుగు సినీవినీలాకాశంలో తన నందమూరి నటవారసత్వాన్ని నిరూపించుకుంటూ అగ్రనటుల జాబితాలో చేరి.. దశాబ్దాలుగా ఆ స్థానంలో కొనసాగతున్న బాలయ్య.. తెలుగింటి ఆడపడచులకు మనస్ఫూర్తిగానే క్షమాపణలు చెప్పారా..? లేక తాను చేసిన వ్యాఖ్యలు.. ఆ వెనువెంటనే వచ్చిన మహిళా దినోత్సవం నేపథ్యంలో మమ అని అనిపించారా..? అన్న అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి. అఖిలాంధ్ర ప్రజలకు ఇప్పటికీ ఆరాధ్యుడిగా నిలచిన నందమూరి తారాక రాముడి తనయుడిగా.. బాలయ్య బాబు తాను చేప్పిన క్షమాపణలు తెలుగింటి ఆడపడచులు అందుకుంటారా..? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

నటుడిగా తాను సావిత్రి అడియో ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలను నాయకుడి హోదాలో క్షమాఫణలు చెప్పడం సమంజసమేనా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడిన హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ.. తన చేతులతో సభను చూపుతూ ఈ నాలుగు గోడలు కాదు.. భయట ఎవరినైనా అడగండి.. అంటూ సవాల్ చేసే వైఖరిలో వివరణ ఇచ్చారు. సరిగ్గా తెలుగింటి అడపడుచులు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

నటుడిగా అడియో లాంఛింగ్ వేదికపై తన అభిమానులు ఎలా ఉండాలనుకుంటున్నారో చెబుతూ.. చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బాలకృష్ణ సరిదిద్దుకోవాలంటే.. నిజంగా తనకు తెలుగింటి ఆడపడచులంటే గౌరవమర్యాదలు ఉన్నట్లయితే.. అలాంటి వేదికపైనే తాను మహిళా లోకానికి క్షమాఫణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. నటీమణులకు సినిమాలలో మాతృత్వాన్ని ప్రసాదించడాన్ని బాలయ్య అత్యంత దారుణంగా కడుపు చేయడమని మాట్లాడటం తప్పుకాదా..? అని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

బాలకృష్ణ మాట మాట్లాడితే తన తండ్రి గురించి గర్వంగా, గోప్పగా చెప్పుకుంటారని, నటుడిగా, రాజకీయ నేతగా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఇంత చౌకబారు వ్యాఖ్యలు చేయడం సబబేనా అని మహిళలు ప్రశ్నించారు. వెండి తెర రారాజుగా వెలిగినా.. సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించినా.. ఆయన మహిళలకు ఇచ్చిన గౌరవం వేరేనంటున్నారు. ఆయన రాజకీయ ఆరంగ్రేటం నుంచే తెలుగింటి ఆడపడచులన్న పదం ఉట్టిపడిందని కూడా వారు గుర్తుచేసుకుంటున్నారు.

బాలకృష్ణ వల్ల పార్టీకి చెడుపేరు వస్తుందని భావించిన తెలుగుదేశం పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందన్న వార్తులు వినబడుతున్నాయి. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలతో నోచ్చుకున్న మహిళలకు మన్నించాలని కోరుతూ నిన్న సాయంత్రం లేఖ విడుదల చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇదిలావుంటూ అదే తరహాలో ఇవాళ బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రసంగం కూడా లేఖ ప్రతిభింభిస్తుందన్న గుసగుసలు వినబడుతున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  savitri audio launch  women's day  apology  

Other Articles