asin to marriage rahul sharma

Asin to marriage rahul sharma

Asin and Rahul Sharma are married, Asin Marriage with Rahul Sharma, Asin Rahul Sharma marriage news, Asin Rahul Sharma Love, Asin Rahul Sharma stills, Actress Asin latest news, Actress Asin movies, Actress Asin movie updates, Actress Asin hot news, Actress Asin stills, Actress Asin gallery.

asin to marriage rahul sharma: Asin and Micromax co-founder Rahul Sharma are married

రాహుల్ ను పెళ్లి చేసుకున్న ఆసిన్

Posted: 01/19/2016 06:31 PM IST
Asin to marriage rahul sharma

తెలుగులో ‘అమ్మనాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో, హిందీలో ‘గజిని’ సినిమాతో మంచి క్రేజ్ ను దక్కించుకొన్న హీరోయిన్ ఆసిన్ పెళ్లి అయిపోయింది. ఈ అమ్మడు గతకొద్ది కాలంగా ప్రముఖ మైక్రోమాక్స్ సంస్థ యాజమాని అయినటువంటి రాహుల్ శర్మతో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇటీవలే తన ప్రేమను అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈరోజు ఉదయం రాహుల్ శర్మతో ఆసిన్ వివాహం న్యూ ఢిల్లీలోని ఓ చర్చిలో జరిగింది. కాగా సాయంత్రం ఓ రిసార్ట్స్లో హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ జంట మరోసారి పెళ్లాడనుంది. ఉదయం జరిగిన పెళ్లి వేడుకలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లుగా తెలిసింది.

ఇక సాయంత్రం అంగరంగ వైభవంగా హిందూ సాంప్రదాయంలో జరుగనున్న వేడుకలో పెళ్లికూతురు అసిన్ ప్రముఖ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తుల్లో మెరవనున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక జనవరి 23న ముంబైలో ఆసిన్ వివాహ రిసెప్షన్ పార్టీ గ్రాండ్ గా జరుగనుంది. ఈ వేడుకకు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సినీప్రముఖులు హాజరు కానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Asin  marriage  Rahul Sharma  wedding stills  

Other Articles