Krishnam Raju confirms Prabhas marriage

Krishnam raju confirms prabhas marriage

Krishnam Raju Confirms on Prabhas Marriage, Krishnam Raju Clarifies on Prabhas Marriage Rumors, Krishnam Raju Clarifies on Prabhas Rumors, Krishnam Raju Clarifies on Prabhas Marriage, Prabhas Marriage issues, Prabhas Marriage gossips, Prabhas movies, Prabhas movie news, Prabhas stills, Prabhas

Krishnam Raju confirms Prabhas marriage Tollywood Rebel Star Krishnam Raju Confirms on Young Rebel star Prabhas Marriage. Prabhas next film Baahubali2.

ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు ట్విస్ట్.. లవ్ మ్యారేజ్?

Posted: 01/19/2016 05:46 PM IST
Krishnam raju confirms prabhas marriage

‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను దక్కించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోని పెళ్లికానీ ప్రసాద్ లా తయారవుతున్నాడు. గతకొద్ది కాలంగా ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం వచ్చే ఏడాది చేసుకుంటా అంటూ గత 5, 6 ఏళ్ల నుంచి చెబుతూనే వున్నాడు. కానీ ఈ విషయంపై రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

ప్రభాస్ ఈ ఏడాది పెళ్లిచేసుకోబోతున్నాడని కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటానని ఇటీవలే సంక్రాంతి పండగ సంధర్భంగా ప్రభాస్ తనకు మాటిచ్చాడని కృష్ణంరాజు తెలియజేసారు. ప్రస్తుతం ప్రభాస్ కు సరిజోడు అయ్యే అమ్మాయిని ఫైనలైజ్ చేయడంలో తన ఫ్యామిలీ అంతా బిజీగా ఉందని, ఈ ఏడాది ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగవచ్చని తెలియజేసారు. అంతటితో ఆగకుండా... ఇది లవ్ కమ్ ఆరెంజ్డ్ మ్యారేజ్ కూడా అవ్వొచ్చు అంటూ కృష్ణంరాజు ప్రకటించారు.

దీంతో లవ్ కం అరెంజ్డ్ మ్యారేజ్ అంటే.. ప్రభాస్ ప్రేమించే ఆ అమ్మాయి ఎవరై వుంటుందా అని సినీవర్గాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి వార్త అభిమానులకు కాస్త సంతోషమనే చెప్పుకోవచ్చు. మరి ఆ పెళ్లి ఘడియలు ఎప్పుడు రానున్నాయో ఏమో. ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు ప్రభాస్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Krishnam Raju  Confirms  Marriage Rumors  Movie News  Stills  

Other Articles