Pawan kalyan Sardar Gabbar Singh creates all time record in Telugu industry

Pawan kalyan sardar gabbar singh creates all time record in telugu industry

Pawan Kalyan, Pawan Kalyans Sardar Gabbar Singh, Sardar, Sardar Gabbar Singh, Pawan Kalyans Next Film, Sardar Gabbar Singh Teaser

Pawan Kalyans upcoming cinema Sardar Gabbar Singh creates new record. The Teaser got ten lakhs hits witt in thity hours.

ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్

Posted: 01/17/2016 03:25 PM IST
Pawan kalyan sardar gabbar singh creates all time record in telugu industry

తెలుగు సినిమా ఇంటస్ట్రీలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి రికార్డ్ క్రియేట్ చేశారు. గోపాల గోపాల సినిమాలో పవన్ అన్నట్లు రావడం కొన్ని లేట్ కావచ్చు మిత్రమా.. కానీ రావడం మాత్రం పక్కా అన్నట్లు కాస్త లేటుగా సర్దార్ గబ్బర్ సింగ్ వస్తున్నా కానీ టీజర్ తోనే తన సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన పవన్ తాజాగా వచ్చిన టీజర్ తో దుమ్మురేపుతున్నారు. కాగా ఈ సినిమా టీజర్ ను సంక్రాంతి కానుకగా చిత్ర టీం రిలీజ్ చేయగా.. అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకొంది. కేవలం 30 గంటల్లోనే 10 లక్షల హిట్స్ పొందిన తొలి తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది. పవన్ గళ్ళ లుంగీ.. ఒక చేత్తో గన్, మరో చేత్తో గుర్రాన్ని పట్టుకొని స్టైల్ గా నడుచుకొని వస్తున్న ఈ టీజర్ కి అభిమానుల నుంచి రెస్పాన్స్ ఓ రేంజ్ లో వస్తున్నది. కొత్త స్టైల్ లో పవన్ కనిపించడంతో యూ ట్యూబ్ లో టీజర్ కు తెగ హిట్స్ వస్తున్నాయి. కాగా ఈ టీజర్ పై అప్పుడే స్నూఫ్ లుకూడా రూపొందాయి.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ తో తొలిసారిగా కాజల్ జోడీ కట్టగా.. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రై. బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ ను హైదారాబాద్ లో జరుపుకొంటుంది. ఇప్పటి దాకా ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో కూడా ఇలా రికార్డ్ క్రియేట్ చేసినా కానీ అంతకన్నా ఫాస్ట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఎంతైనా పవర్ స్టార్ ‘పవర్’ స్టారే. అయినా పవర్ స్టార్ ట్రెండ్ సెట్ చేసే వాడు కాదు.. ట్రెండ్ సెట్ చేసేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles