Court accepts plea against SRK, Salman Khan

Court accepts plea against srk salman khan

Salman Khan, Sharukh Khan, colours TV, Big Boss, Kalimandir

A local court accepted a plea by Hindu Mahasabha against Bollywood superstars Salman Khan, Shah Rukh Khan and a private TV channel for purportedly showing the actors inside a temple wearing shoes during a reality show. The court has fixed the date for hearing on January 18. “A scene with Shah Rukh Khan and Salman Khan inside a Kali temple on the sets of TV reality show ‘Bigg Boss’ was broadcast by Colors channel in December last year,” Bharat Rajput, president of Hindu Mahasabha’s Meerut unit said.

సల్మాన్, షారుఖ్ ల యాడ్ పై కోర్టులో కేసు

Posted: 01/17/2016 04:05 PM IST
Court accepts plea against srk salman khan

హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒకాయన కలెక్షన్ల నవాబు.. మరొకాయన వరుస విజయాలతో తనకు ఎదురులేకుండా చేసుకున్న స్టార్ హీరోలు. కానీ గత కొంత కాలంగా వారిద్దకి అస్సలు టైం బాగులేనట్లుంది. అందుకే వివాదాలు వారిని చుట్టుముడుతున్నాయి. అయితే ఎవరా ఇద్దరు అనుకుంటున్నారా..? బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్. వీరిద్దరు చేసిన ఓ యాడ్ మీద వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. 2015 డిసెంబర్ లో ప్రసారమైన కలర్స్ ఛానల్ రియాల్టీ షో బిగ్ బాస్ కార్యక్రమం కోసం వేసిన సెట్ పై ప్రమోషన్ కోసం వచ్చి సల్మాన్ ఖాన్, షారూఖ్ లు కాళీ మందిరంలో.. కలుసుకున్నట్లు చూపించారు.

అయితే అక్కడ కాళీ మందిరం సెట్ లో సల్మాన్ ఖాన్, షారూఖ్ లు షూ తో తిరిగారు. దీంతో హిందూ మహాసభ దాఖలు చేసిన పిటిషన్ ను మీరట్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఫస్ట్ ఈ విషయం పై కలర్స్ వారి దృష్టికి తెచ్చినా వారు పట్టించుకోలేదు. దీంతో హిందూ మహా సభ నేత భారత్ రాజ్ పుట్ కోర్టును ఆశ్రయించారు. కాగా సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లకు గత కొంతకాలంగా మాటలు లేవు. ఇటీవలే మాటలు చిగురించాయి. వెంటనే ఇలా వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయమే ప్రస్తుతం బీ టౌన్ లో హాట్ టాపిక్ అయింది. మరి చూడాలి కోర్టు ఎలాంటి చర్యలకు దిగుతుందో.. ఖాన్ ద్వయానికి కోర్టు ఎలాంటి ఝలక్ ఇస్తుందొ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Sharukh Khan  colours TV  Big Boss  Kalimandir  

Other Articles