NTR and Balakrishna on Sankranthi Eve

Ntr and balakrishna on sankranthi eve

NTR, Balakrsihna, NTRs Naannaku Prematho, Balakrishnas Dictator, Snakranthi, Telugu Cinemas on Sankranthi

NTR and his uncle balakrishna will fight on Box office at Sankranthi eve. NTRs Naannaku Prematho and Balakrsihnas Dictator will releasing on Sankranthi.

సంక్రాంతి బరిలో "బాబాయి - అబ్బాయి"

Posted: 01/11/2016 11:09 AM IST
Ntr and balakrishna on sankranthi eve

టైటిల్ లో ఏ మాత్రం ప్రాస తగ్గలేదు కదా? అచ్చం ఇలాగే, ఆడియన్స్ లో ఎంతమాత్రం ఆత్రుత తగ్గడం లేదు. సంక్రాంతి 2016 సినిమాల తో సంబరాన్ని మాత్రమే కాదు, కాస్త కోల్డ్ వార్ ని కూడా మూట గట్టి తీసుకోస్తోందా?

ఒకరికి శత చిత్ర మైలు రాయి చేరుకోడానికి ఈ సినిమా మెట్టు... మరొకరికి 25 వ మైలు రాయి ఈ సినిమా... ఇద్దరికీ ఇవి చాలా ముఖ్యమైన సినిమాలు... వీరి అభిమానులకు కూడా అంతేగా మరి...  అయితే, వీరిద్దరూ ఒకే వంశానికి చెందిన వారు... నవరస సర్ర్వభౌముడు పుట్టిన వంశం అది... ఒకరు వీరి అబ్బాయి అయితే, మరొకరు మనవడు... వీరిద్దరూ ఒకరికొకరు బాబాయి, అబ్బాయి... సంక్రాంతిని వేదికగా చేసుకుని, తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు వీరిద్దరూ. మరి ఈ బాబాయి - అబ్బాయి సినిమాలని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? నందమూరి అభిమానులు ఎలా ఆరాధిస్తారు? సంక్రాంతే చెప్పాలి.

యంగ్ టైగర్ యన్. టీ. ఆర్., ప్రయోగాలకు మారుపెరైన సుకుమార్ తో కలిసి చేసిన స్టయిలిష్ అటెంప్ట్ "నాన్నకు ప్రేమతో"... సరికొత్త క్లాసీ లుక్ తో, ఐ.ఓ. వాక్ బోర్డ్ మీద హీరోయిన్ ని ఫాలో అవుతూ కనపడతాడు, ఈ సినిమాలో యన్. టీ. ఆర్. ఈ సినిమాకు సంబంధించి ప్రతీ అప్డేట్, మనకి సినిమా చూడాలి అన్న ఆసక్తిని పెంచుతూనే ఉంది. ముందు, సంక్రాంతి బరిలో ఉండనన్న "నాన్నకు ప్రేమతో", అభిమానులను ఇంకా వెయిట్ చేయించడం ఇష్టం లేక, సంక్రాంతికే ఒచ్చేస్తున్నాడు. యంగ్ టైగర్ 25వ సినిమా కావడం వల్ల కూడా, సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

"డిక్టేటర్" గా బాలయ్య, సంక్రాంతికి రావాలని, ముందు నుంచీ ఫిక్స్ అయ్యి ఉన్నాడు. అనుకున్నట్టే, సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. ఏ మాత్రం క్రేజ్ తగ్గని బాలయ్యకు, 99 వ చిత్రం ఇది. శ్రీవాస్ దర్శకుడు కావడంతో, అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, తన టచ్ కూడా యాడ్ చేసి, "డిక్టేటర్" గా బాలయ్యను సంక్రాంతి రేస్ లో నిలబెట్టాడు...

అవును... పోటీ ఏ... కానీ, ఆశయం మాత్రం ఒక్కటే, ప్రేక్షకులని అలరించాలని... అందుకే, పోటీ ఉన్నా... నందమూరి బాబాయి - అబ్బాయి మధ్య ఈ పోటీ ఆరోగ్యవంతమైన పోటీ... "నాన్నకు ప్రేమతో", "డిక్టేటర్" కు సమానంగా ఆనందం రావాలని, సంక్రాంతి సాక్షిగా కోరుకుందాం మనం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles