Sardar shows Pawanism

Sardar shows pawanism

Pawan Kalyan, Sardar, pawanism, Sardar Gabbar Singh

Power star Pawan Kalyan one more time shows Pawanism. He helped Pavala Shyamalas Daughter. He gave some money for her treatment.

"పవనిజం" చాటిన "సర్దార్"

Posted: 01/11/2016 10:56 AM IST
Sardar shows pawanism

"జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్" ... ప్రతీ పవన్ అభిమాని, సినీ అభిమాని, తన జీవిత కాలంలో ఒక్కసారైనా, మనస్పూర్తిగా ఇలా జేజేలు కొట్టక మానడు... ఎందుకంటే, ఇంతటి మహోన్నతమైన మనస్తత్వం పవన్ ది...

"జన సేన" నాయకుడిగా, ప్రజలకు అండగా, ప్రజల సమస్యలపై ప్రశ్నించే ఆయుధంగా, తన సినిమాలతో వినోదాన్ని పంచుతూ - సందేశం తో ఆలోచింపజేసే శక్తిగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే కొండంత అండగా, పవన్ మనకు సుపరిచితం... తన ఔదార్యాన్ని మరోసారి చాటి చెప్పాడు, పవర్ స్టార్...

సీనియర్ హాస్య నటీమణి, పావలా శ్యామల కు పవర్ స్టార్ అందించిన ఆర్ధిక సహాయం, మనకెప్పుడూ గుర్తే... కొన్ని రోజుల క్రితం, ఈవిడ అమ్మాయి, అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది... ఆనోటా - ఈనోటా, ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్, ఉన్నపళంగా యాభై వేల రూపాయల చెక్కు రాసి ఇవ్వడమే కాక, హాస్పిటల్ వర్గాలకు ఫోన్ చేసి, ఆ అమ్మాయి ట్రీట్మెంట్ కి అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తాను అని హామీ కూడా ఇచ్చాడు... మొన్న చెన్నై వరద బాదితులకు కోట్లల్లో సహాయం అందించాడు పవన్...

ఇలా, పవన్ మానవీయతను చాటే సంఘటనలు కోకొల్లలు... అందుకే "పవనిజం" అభిమానుల బాట... "సర్దార్" ... పవన్ ను ఉద్దేశించి అభిమానుల మాట...  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sardar  pawanism  Sardar Gabbar Singh  

Other Articles