He got the first weeding from Asin and Rahul Sharma

He got the first weeding from asin and rahul sharma

Asin, Rahul Sharma, Akshay Kumar, Asin Thottumkal, Asin Thottumkal Wedding

While actress Asin Thottumkal and Micromax co-founder Rahul Sharma's marriage date still remains a mystery, actor Akshay Kumar has shared glimpse of their wedding card after getting the first invite for the auspicious ceremony of his “close friends”. The actor, who is said to have introduced Asin and Rahul, took to Twitter to express his feelings on getting the card.

ఆసిన్ మొదటి పెళ్లి శుభలేఖ ఆయనకే

Posted: 01/10/2016 04:21 PM IST
He got the first weeding from asin and rahul sharma

అందాల రాశి ఆసిన్ తొందరలోనే ఓ ఇంటిది కాబోతోంది అని అందరికి తెలుసు. అయితే ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ శర్మతో కలిసి తన జీవితాన్ని పంచుకోనున్న ఆసిస్ తన మొదటి వెడ్డింగ్ కార్డ్ ను బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ కు ఇచ్చింది. హీరోయిన్ అసిన్ మైక్రోమాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మల వివాహం జనవరి 23న ఢిల్లీలో గ్రాండ్‌గా జరగనుంది. ఈ సందర్భంగా అసిన్, రాహుల్ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పెళ్లి శుభలేఖలు పంచుతూ బిజీగా ఉన్నారు. డార్క్ బ్రౌన్ మరియు బంగారు రంగుల కలయికలో ఉన్న శుభలేఖను అక్షయ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తు చేశారు.

రాహుల్, అసిన్‌ల ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నేను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అక్షయ్ కుమార్. అసిన్, రాహుల్ మధ్య బంధం బలపడటానికి కారణం అక్షయ్ కుమారే అని అసిన్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే రాహుల్, అక్షయ్ కూడా మంచి స్నేహితులు కావడంతోనే వీరి మొదటి శుభలేఖను అక్షయ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... అసిన్, రాహుల్‌ల వివాహం ఢిల్లీలో జరగనుండగా... ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ ఇస్తూ అసిన్, రాహుల్ బిజీగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asin  Rahul Sharma  Akshay Kumar  Asin Thottumkal  Asin Thottumkal Wedding  

Other Articles