Sardar Gabbar singh photo with them

Sardar gabbar singh photo with them

Pawan Kalyan, Pawan Kalyan Sardar, Sardar Gabbar Singh, Sardar posters, Pawan Kalyan as Sardar

Power Star Pawan Kalyans upcoming movie Sardar Gabbar Singh shooting in Gujarat. Pawan Kalyan with ali and Brahmaji photo virally going in social media.

సర్దార్ గబ్బర్ సింగ్ తో వాళ్ల ఫోటో హల్ చల్

Posted: 01/10/2016 04:55 PM IST
Sardar gabbar singh photo with them

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనను ఒక్కసారి చూస్తే చాలు అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. ఆయనతో ఒక్క ఫోటో దిగితే అంత కన్నానా అని భావించే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్లలో ఆయన అభిమానులే కాదు.. ఎంతో మంది స్టార్లు కూడా ఉన్నారు. అయితే తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ తో కలిసి అలీ, బ్రహ్మాజీ తదితరులు ఫోటో దిగారు. అయితే ఈ ఫోటోను శరత్ మరార్ ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యగా.. దాన్ని బ్రహ్మాజీ రీట్వీట్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా తెలుగు సినిమా రికార్డులను ఊపేసింది. అదే తరహాలో దానికి సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న సర్దార్ గబ్బర్ సింగ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. గుజరాత్ లొకేషన్ లో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అదిరిపోయింది. పవన్ అభిమానులకు సర్దార్ గబ్బర్ సింగ్ అలరించడానికి, బాక్సాఫీస్ లను షేక్ చెయ్యడానికి తొందరలోనే మన ముందుకు రానున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles