Balakrishna | Dictator | First Ticket Price | Online Bookings | Trailers

Balakrishna dictator movie first ticket price

Balakrishna Dictator First Ticket Price, Balakrishna Dictator First Ticket, Dictator First Ticket Price, Balakrishna Dictator Ticket Price, Balakrishna Dictator Advance Booking, Balakrishna Dictator Bookings, Balakrishna Dictator Release Date, Balakrishna Dictator Theaters list, Balakrishna Dictator latest updates, Balakrishna, Dictator

Balakrishna Dictator Movie First Ticket Price: Nandamuri Balakrishna, Anjali and Sonal Chauhan. Dictator music is composed by S Thaman. Directed by Sriwass. Produced by Eros International & co-produced by Vedaashwa Creations.

కొత్త రికార్డులు సృష్టించిన ‘డిక్టేటర్’

Posted: 01/09/2016 01:09 PM IST
Balakrishna dictator movie first ticket price

నందమూరి బాలకృష్ణ అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగేస్తున్నారు. ఎందుకంటే విడుదలకు ముందే ‘డిక్టేటర్’ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణకు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కానీ ఈసారి మాత్రం బాలకృష్ణ క్రేజ్ భీభత్సంగా పెరిగిపోయి, కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ‘సింహా’ సినిమాలో బాలయ్య చెప్పిన.. ‘చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే’ అనే డైలాగ్ ప్రస్తుతం నిజమే అయ్యింది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరోకు దక్కని రికార్డు బాలయ్య చిత్రం ‘డిక్టేటర్’కు దక్కింది. బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ చిత్రం ఈనెల 14వ తేదిన సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇందులో భాగంగా ఈ చిత్రం మొదటి టికెట్ ను ఓ ఎన్నారై ఏకంగా 3.6 లక్షలు చెల్లించి కొనుగోలు చేసాడు.

యూఎస్ డిస్ట్రిబ్యూటర్ ‘డిక్టేటర్’ సినిమా మొదటి టికెట్ పై ఏర్పాటుచేసిన వేలంపాట ఎంతో సందడిగా, ఉత్కంఠగా కొనసాగింది. ఇందులో ఓ ఎన్నారై 5,555 డాలర్లను(దాదాపు 3.6 లక్షలు) చెల్లించి, ‘డిక్టేటర్’ మొదటి టికెట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరో సినిమా ఫస్ట్ టికెట్ ఇంత భారీ రేటుకు అమ్ముడుపోలేదు. మొత్తానికి ‘డిక్టేటర్’ చిత్రం మొదటి టికెట్ తోనే కొత్త రికార్డును క్రియేట్ చేసింది. మరి సినిమా విడుదలయ్యాక ఎలాంటి రికార్డుల మోత మోగించనుందో చూడాలి.

భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. బాలయ్య సరసన అంజలి, సొనాల్ చౌహన్, అక్షలు హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ‘డిక్టేటర్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమయ్యింది. అడ్వాన్స్ బుకింగ్స్ సైతం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏదేమైనా నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరిగే సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  First Ticket Price  Online Bookings  Trailers  

Other Articles