AR Murugadoss clarifies on Mahesh Babu film

Ar murugadoss clarifies on mahesh babu film

AR Murugadoss clarifies on Mahesh Babu, Mahesh Babu Murugadoss film title, Mahesh Babu remuneration for Murugadoss film, mahesh babu latest news, mahesh babu movie news, mahesh babu movie updates, mahesh babu stills, mahesh babu

AR Murugadoss clarifies on Mahesh Babu film: Tollywood prince mahesh babu latest film brahmotsavam. after this film mahesh will do a film with tamil top director murugadas. Cinematographer Santosh Sivan. Mahesh Babu charges 30 crores for AR Murugadoss film

మహేష్ కథ వేరంటున్న మురుగదాస్

Posted: 01/09/2016 04:21 PM IST
Ar murugadoss clarifies on mahesh babu film

‘గజిని’, ‘తుపాకీ’, ‘కత్తి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, న్యాయవ్యవస్థ, రాజకీయాల వంటి అంశాలపై రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఎనిమి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలిస్తోంది.

అయితే ఈ కథతో ముందుగా తమిళ స్టార్ థలా అజిత్ తో తీయడానికి మురుగదాస్ సిద్ధం చేసుకున్నాడని, కానీ అజిత్ కు ఈ స్టోరీ నచ్చకపోవడంతో అదే కథను ప్రస్తుతం మహేష్ తో తీయబోతున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా మురుగదాస్ ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

మురుగదాస్ స్పందిస్తూ.. అజిత్ తో అనుకున్న కథ వేరు.. మహేష్ తో తీయబోయే కథ వేరు. ఇది కేవలం మహేష్ కోసం రాసుకున్న కథ మాత్రమే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి, కేవలం ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మురుగదాస్ స్పష్టం చేసారు.

ఇక ప్రస్తుతం మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది వేసవి సెలవుల కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AR Murugadoss  clarifies  Mahesh Babu  Brahmotsavam  tweets  Stills  

Other Articles