Ravi Teja in Bengal Tiger Success Meet

Ravi teja in bengal tiger success meet

Bengal Tiger Movie Success Meet, Bengal Tiger Success Meet, Bengal Tiger Movie collections, Bengal Tiger Movie first week, Bengal Tiger Movie updates, Bengal Tiger Movie latest news, Bengal Tiger Movie trailers, Bengal Tiger Movie songs, Bengal Tiger Movie

Ravi Teja in Bengal Tiger Success Meet: Mass Maharaja Ravi teja latest hit film Bengal Tiger. Sampath Nandi direction. Tamanna, Rashi khanna heroines.

‘బెంగాల్ టైగర్’టీంతో మరోసారి: రవితేజ

Posted: 12/19/2015 10:27 AM IST
Ravi teja in bengal tiger success meet

రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ‘బెంగాల్ టైగర్’ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో రవితేజ, తమన్నా, సంపత్ నంది, కె.కె.రాధామోహన్, రామ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా రవితేజ మాట్లాడుతూ... బెంగాల్ టైగర్ తో సంపత్ నందికి హ్యట్రిక్ హిట్ రావడం చాలా సంతోషంగా వుంది. ఈ సక్సెస్ టీం అందరిది. ఈ ‘బెంగాల్ టైగర్’ టీంతో మరోసారి పనిచేయాలని వుందని అన్నారు.

తమన్నా మాట్లాడుతూ... ‘బెంగాల్ టైగర్’ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. రవితేజ లేని ఈ సినిమా సక్సెస్ ను ఊహించలేం. రాధామోహన్ గారు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమాను పక్కా ప్లానింగ్ తో ముందుకు తీసుకెళ్లారు. మంచి టీంతో పనిచేసినందుకు చాలా ఆనందంగా వుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengal Tiger  Success meet  Collections  stills  trailers  

Other Articles