Devi Sri Prasad starts Re Recording for Nannaku Prematho

Devi sri prasad starts re recording for nannaku prematho

Devi Sri Prasad starts RR for Nannaku Prematho, Devi Sri Prasad joins in Nannaku Prematho RR, Devi Sri Prasad latest news, Devi Sri Prasad Nannaku prematho stills, Devi Sri Prasad movies, Devi Sri Prasad songs, Devi Sri Prasad latest updates, Nannaku Prematho movie news, Nannaku Prematho Re Recording, Nannaku Prematho latest updates, Nannaku Prematho posters, Ntr, Rakul

Devi Sri Prasad starts Re Recording for Nannaku Prematho: South indian rocking music director Devi Sri Prasad latest telugu film Nannaku Prematho. Ntr, Rakul acts in lead roles. Sukumar direction

నాన్నకు ప్రేమతో... దటీజ్ సన్నాఫ్ సత్యమూర్తి

Posted: 12/17/2015 12:57 PM IST
Devi sri prasad starts re recording for nannaku prematho

ఇండియన్ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్ కు మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. తన సినిమాల్లోని పాటల్లోనే కాకుండా తనలో వున్న ఎనర్జీతో అదరగొట్టేస్తుంటాడు. అలాంటి దేవి తన వృత్తికి ఇచ్చే ప్రాముఖ్యత ఎంటో మరోసారి నిరూపించుకుంటున్నాడు. ఇటీవలే దేవిశ్రీప్రసాద్ తండ్రి ప్రముఖ రచయిత సత్యమూర్తి మరణించిన విషయం తెలిసిందే.

తన తండ్రి మరణించి ఎక్కువ రోజులు కాకపోయినప్పటికీ.. ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటం వలన, తన వృత్తికి ద్రోహం చేయకుండా.. తన తండ్రి చనిపోయాడనే బాధను కూడా పక్కన పెట్టేసి మళ్లీ మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీ అయ్యాడు.

ప్రస్తుతం దేవి సంగీతం అందిస్తున్న తెలుగు చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసారు. అయితే ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

అయితే దేవి తండ్రి మరణించడం వలన ఈ సినిమా రీరికార్డింగ్ విషయంలో కాస్త ఆలస్యం జరుగుతుందేమోనని భావించి, ఈ సినిమా విడుదలను కాస్త వాయిదా వేయాలని అనుకున్నారు చిత్ర యూనిట్. కానీ దేవి మాత్రం ఎలాంటి ఆలస్యం చేయకుండా ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర దర్శకనిర్మాతలతో మాట్లాడి.. మీరు అనుకున్న సమయానికే ఈ సినిమాను విడుదల చేయండి. సినిమా విడుదల ఆలస్యం చేయకండి అని చెప్పి, తన మ్యూజిక్ బృందంతో కలిసి ఈ సినిమా రీరికార్డింగ్ పనుల్లో మళ్లీ దేవి స్టార్ట్ చేసారట. దేవి వర్క్ డెడికేషన్ చూసి చిత్ర యూనిట్ ఎంతో ఆనందంగా ఫీలవుతున్నారు.

నిజంగా దేవి ఎనర్జీ ఎలా వుంటుందో అందరికి తెలిసిందే. కానీ తన తండ్రి చనిపోయినా కూడా వర్క్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా.. సినిమా కోసం తన బాధను కూడా దిగమింగి, వర్క్ లో నిమగ్నమవడం చాలా గొప్ప విషయమని సినీవర్గాలు దేవిని ప్రశంసలతో అభినందిస్తున్నారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని ఖచ్చింతగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nannaku Prematho  Devi Sri Prasad  Re Recording  Ntr  Rakul preeth singh  

Other Articles