Loafer movie Triple Platinum disc function

Loafer movie triple platinum disc function

Loafer Triple Platinum disc function, Loafer movie trailers, Loafer online booking, Loafer tickets, Loafer show bookings, Loafer stills, Loafer movie updates, Loafer, Varun Tej stills, Varun Tej

Loafer movie Triple Platinum disc function: Puri Jagannadh latest film Loafer. Varun Tej, Disha patani hero heroines, Revathi, Posani krishnamurali acts in lead roles.

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కోసం లోఫర్ వెయిటింగ్

Posted: 12/16/2015 09:57 AM IST
Loafer movie triple platinum disc function

'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్‌'. సునీల్‌ కశ్యప్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. ఈ ఆడియోకి అన్ని ఏరియాల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో 'లోఫర్‌' చిత్రం ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. చిత్రయూనిట్‌ సభ్యులకు ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో హీరో వరుణ్‌తేజ్‌, హీరోయిన్‌ దిశా పటాని, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌, సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌, నటుడు, నిర్మాత అశోక్‌కుమార్‌, అభిషేక్‌, అల్లూరి వెంకటేశ్వరరావు, పాటల రచయిత భాస్కరభట్ల, అలంకార్‌ ప్రసాద్‌, ముత్యాల రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

భాస్కరభట్ల మాట్లాడుతూ.... ''పాటలను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్‌. పూరిగారు నాతో మంచి పాటలు రాయించారు. అందుకు ఆయనకు, కళ్యాణ్‌గారికి థాంక్స్‌. సినిమాను సూపర్‌హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు. సునీల్‌ కశ్యప్‌ మాట్లాడుతూ.... ''మనమంతా కూడా ఎప్పుడో ఒకసారి తుంటరి పనులు చేసి లోఫర్‌ అనే తిట్టు తినే ఉంటాం. ఇప్పుడు ఈ చిత్రంతో వరుణ్‌ అందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నాడు. పాటలను వింటున్నప్పుడే కాదు, సినిమా చూస్తున్నప్పుడు కూడా అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు'' అన్నారు.

దిశా పటాని మాట్లాడుతూ... ''ఆడియో ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కళ్యాణ్‌గారికి థాంక్స్‌. తొలి సినిమాలోనే పూరిలాంటి గొప్ప దర్శకుడితో పనిచేయడం ఆనందంగా ఉంది. వరుణ్‌తేజ్‌ బాగా సపోర్ట్‌ చేశాడు. సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్‌'' అన్నారు.

డాషిండ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ... '''లోఫర్‌ ' సినిమా ట్రిపుల్‌ ప్లాటినం వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉంది. కళ్యాణ్‌గారితో నేను చేసిన రెండో సినిమా. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తర్వాత నేను చేసిన తల్లి కొడుకుల కథ. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా. సునీల్‌ కశ్యప్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దిశాపటాని తొలి సినిమా అయినా చక్కగా చేసింది. పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అవుతుంది. మెగా ఫ్యామిలీలో వరుణ్‌ మరో పెద్ద హీరో అవుతాడు. చిరంజీవిగారు మొన్న కలిసినప్పుడు వరుణ్‌గురించి పది నిమిషాలు మాట్లాడారు. చిరంజీవిగారు పునాదిరాళ్ళు నుండి నటిస్తున్నారు. ఎన్నో సినిమాలు హిట్‌ కొట్టారు. కథ బాగున్నా, బాగలేకపోయినా చిరంజీవిగారు బాగా చేయలేదని ఎవరం చెప్పలేం. మళ్ళీ వరుణ్‌ అలాంటి పేరుని సంపాదించుకుంటాడు. చిరంజీవి, నాగబాబు, మెగాఫ్యామిలీ గర్వపడే స్థాయికి వరుణ్‌ చేరుకుంటాడు'' అన్నారు.

సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ... ''మెగాఫ్యాన్స్‌ను లీడ్‌ చేసిన వ్యక్తి నాగబాబుగారు. డిసెంబర్‌ 17న అభిమానులు భుజాలపై మోసే హీరో ఎవరంటే వరుణ్‌తేజ్‌. సినిమా చూసిన అందరూ వరుణ్‌కి ఫ్యాన్‌గా మారిపోతారు. బ్రహ్మారథం పడతారు. ఓ అజానుబాహుడు హీరో అయ్యాడని అనుకుంటారు. మెగాఫ్యామిలీలో ఇప్పటి హీరోల్లో వరుణ్‌ చేసిన పెర్‌ఫార్మెన్స్‌ ఎవరూ చేయలేదు. మెగా అభిమానులకు ఒక ప్రిన్స్‌, రాకుమారుడు వచ్చాడు. పూరిగారు ఎక్స్‌ట్రార్డినరీ సినిమా తీశారు. రేపు అభిమానులందరూ ఎంజాయ్‌ చేసే సినిమా అవుతుంది'' అన్నారు.

వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ... ''సునీల్‌ కశ్యప్‌ ఎక్స్‌ట్రార్డినరీ ఆల్బమ్‌ ఇచ్చాడు. భాస్కరభట్ల సహా గేయ రచయితలు మంచి లిరిక్స్‌ ఇచ్చారు. చరణ్‌ అన్నయ్య ఈరోజు పెద్దనాన్నగారి 150వ సినిమాను అనౌన్స్‌ చేశారు. అలాగే బాబాయ్‌ సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ కోసం కూడా వెయిట్‌ చేస్తున్నాను. పెద్దనాన్న, బాబాయ్‌ని చూస్తూ పెరిగాను. వారికి నేను పెద్ద అభిమానిని. వాళ్లే నాకు ఇన్‌స్పిరేషన్‌. డెఫనెట్‌గా వారి పేరు నిలబెడతాను. పూరిజగన్‌గారికి, కళ్యాణ్‌గారికి థాంక్స్‌. డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను'' అన్నారు.
 
వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌, టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎ.కుమార్‌ వర్మ, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కె.యస్‌.రాజు, గల్లా రమేష్‌, కిషోర్‌ కృష్ణ, కో డైరెక్టర్‌: శివరామకృష్ణ, కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజయ్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Loafer  stills  Online booking  tickets  

Other Articles