Baahubali The Conclusion Shooting Starts

Baahubali the conclusion shooting starts

Baahubali 2 Movie shooting details, Baahubali 2 Movie updates, Baahubali 2 Movie details, Baahubali 2 Movie news, Baahubali 2 Movies, Baahubali 2 Movie stills, Baahubali 2 updates, Prabhas latest news, Prabhas movies, Prabhas stills, Prabhas

Baahubali The Conclusion Shooting Starts: SS Rajamouli latest film Baahubali 2. Prabhas, Rana, Anushka, Ramyakrishna acts in lead roles. MM Keeravani music.

నేడే ప్రారంభం: ప్రభాస్ ‘బాహుబలి2’ షూటింగ్

Posted: 12/16/2015 10:05 AM IST
Baahubali the conclusion shooting starts

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా ప్రధాన పాత్రలలో నటించిన ‘బాహుబలి’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న విడుదలై రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాహుబలి, శివుడు పాత్రలలో ప్రభాస్ అద్భుతంగా నటించాడు. అలాగే భల్లాలదేవుడి పాత్రలో రానా యాక్టింగ్ సూపర్బ్. వీరిద్దరితో పాటు రమ్యకృష్ణ నటన సినిమాకు ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. అలాగే సత్యరాజ్, తమన్నా, నాజర్ తదితరులు వారి వారి పాత్రలలో జీవించేసారు.

కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు రీరికార్డింగ్ అద్భుతం. ఇలాంటి సినిమాలకు కీరవాణి తప్ప మరెవరూ సంగీతం అందించలేరనే విధంగా ఆయన రీరికార్డింగ్ అందించారు. ‘బాహుబలి-ది బిగినింగ్’ కు వచ్చిన కలెక్షన్లు అన్ని చోట్ల రికార్డులను క్రియేట్ చేసాయి. అయితే ఇపుడు ‘బాహుబలి- ది కంక్లూజన్’పై మరింత ఎక్కువయ్యాయి. ‘బాహుబలి’కి సీక్వెల్ గా రాబోతున్న సెకండ్ పార్ట్ షూటింగ్ నేటి(డిసెంబర్ 16) నుంచి ప్రారంభం కానుంది.

ఇందులో ప్రభాస్, రానా, అనుష్క తదితరులు పాల్గొననున్నారు. ‘బాహుబలి’ మొదటి భాగం కంటే ఎక్కువ అంచనాలు ‘బాహుబలి2’పై వున్నాయి. దీంతో ఈ సీక్వెల్ ను చాలా జాగ్రత్తగా తెరకెక్కించనున్నాడు రాజమౌళి. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Baahubali2  Shooting starts  Stills  News  

Other Articles