Dictator Movie Audio on 20 December

Dictator movie audio on 20 december

Balakrishna Dictator Movie Audio Date, Balakrishna Dictator First Look, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna Dictator Movie shooting updates, Balakrishna Dictator News, Balakrishna Dictator Movie details, Balakrishna Dictator, Balakrishna Latest News, Balakrishna Movie News, Balakrishna Movie Updates

Dictator Movie Audio on 20 December: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

ఈనెల 20న అమరావతిలో ఘనంగా ‘డిక్టేటర్’ ఆడియో విడుదల

Posted: 12/15/2015 10:14 AM IST
Dictator movie audio on 20 december

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌,వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌.‘లౌక్యం’వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ అందించిన శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని డిసెంబర్‌ 20న ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో క్లయిమాక్స్ ఫైట్ ను భారీ లెవల్లో చిత్రీకరిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంత కంటే ముందుగా పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు సమక్షంలో ఆడియో వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను అమరావతి వేదికైంది. ఇటీవల ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా ఇటీవలే కాలచక్రను నిర్వహించారు. ఆ కార్యక్రమం తర్వాత అమరావతిలో జరగున్ను వేడుక ‘డిక్టేటర్‌’ చిత్ర ఆడియో విడుదల. అంతే కాకుండా అమరావతిలో జరుగనున్న తొలి సినిమా కార్యక్రమం కూడా ఇదే కావడం విశేషం.

సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Audio Release Venue  Anjali  sonal chauhan  stills  

Other Articles