Dhanush Nava Manmadhudu Movie Audio Released

Dhanush nava manmadhudu movie audio released

Dhanush Nava Manmadhudu Release Date, Dhanush as Nava Manmadhudu, Dhanush Nava Manmadhudu release date, Dhanush Nava Manmadhudu news, Dhanush Nava Manmadhudu stills, Dhanush Nava Manmadhudu movie news, Dhanush movies, Dhanush movie updates, Dhanush stills, Dhanush

Dhanush Nava Manmadhudu Movie Audio Released: Tamil star hero Dhanush latest film Thanga Magan. This film telugu version title Nava Manmadhudu. Samantha, Amy Jackson

నేడే ధనుష్ ‘నవ మన్మధుడు’ పాటలు విడుదల

Posted: 12/11/2015 12:36 PM IST
Dhanush nava manmadhudu movie audio released

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో రాణిస్తూ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన మాస్, కమర్షియల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ధ‌నుష్ హీరోగా స‌మంత‌, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘తంగ మ‌గ‌న్‌’. ఈ చిత్రాన్ని’న‌వ‌మ‌న్మ‌థుడు’ అనే పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. డి.ప్ర‌తాప్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బృందావ‌న్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెలుగులో విడుదలవుతుంది. వేల్ రాజ్ ద‌ర్శ‌కుడు. ఎన్‌.వెంక‌టేష్, ఎన్‌.ర‌వికాంత్ నిర్మాత‌లు. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమానుడిసెంబ‌ర్ 18న గ్రాండ్ లెవ‌ల్‌లో  విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు ఎన్‌.వెంక‌టేష్‌, ఎన్‌.ర‌వికాంత్ మాట్లాడుతూ... ధ‌నుష్ విల‌క్ష‌ణ‌మైన హీరోయిజాన్ని ప్ర‌ద‌ర్శించే హీరో. త‌మిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఆయ‌న‌కుప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. గ‌తంలో ధ‌నుష్‌తో ర‌ఘువ‌ర‌న్ బి.టెక్(త‌మిళంలో వేలై ఇల్లై ప‌ట్ట‌దారి) వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన వేల్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈచిత్రం తెర‌కెక్కింది. ల‌వ్‌, యాక్ష‌న్, ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా సినిమా రూపొందింది. యువ సంగీత కెర‌టం అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతంఅందించాడు. ఆడియో . ఈరోజు మార్కెట్ లో  ఆడియో విడుదల చేస్తున్నాం. అలాగే సినిమాను డిసెంబ‌ర్ 18న గ్రాండ్ లెవ‌ల్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

ధ‌నుష్, స‌మంత‌, ఎమీజాక్సన్‌, రాధికా శ‌ర‌త్‌కుమార్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ ర‌విచంద్రన్, కెమెరాః ఎ.కుమర‌న్‌, ఎడిటింగ్: ఎం.వి.రాజేష్‌కుమార్‌, స‌హ నిర్మాత‌లుః ఎం.డి.ఎం.ఆంజ‌నేయ‌రెడ్డి, కె.య‌స్‌.రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: వేల్‌రాజ్‌.





If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles