Apple company selected best album 2015 son of satyamurthy

Apple company selected best album 2015 son of satyamurthy

Apple selected son of satyamurthy, son of satyamurthy best album 2015, son of satyamurthy apple best album, Apple selects son of satyamurthy audio, DSP son of satyamurthy album, son of satyamurthy latest news, son of satyamurthy songs

Apple selected best album 2015 son of satyamurthy: Apple company selected Devi Sri Prasad`s Son of satyamurthy Movie Audio of 2015 Best Album. Devi Sri Prasad music.

స్టైలిష్ స్టార్-రాకింగ్ స్టార్ కాంబినేషన్ కు ఆపిల్ గౌరవం

Posted: 12/11/2015 03:42 PM IST
Apple company selected best album 2015 son of satyamurthy

స్టైలిష్ స్టార్ - రాకింగ్ స్టార్ కాంబినేషన్ కు యాపిల్ సంస్థ ద్వారా మంచి గౌరవం దక్కింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాకింగ్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ సినిమా విడుదలై మంచి మ్యూజికల్ హిట్ చిత్రంగా నిలిచింది.

అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఇందులోని ‘సూపర్ మచ్చీ...’ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రతి ఏడాది ఆపిల్ సంస్థ ఐట్యూన్స్ స్టోర్ ద్వారా రిలీజ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్స్లో బెస్ట్ ఆల్బమ్స్ను, ఆ ఏడాది చివరలోఎంపిక చేస్తోంది.

మ్యూజిక్ క్వాలిటీ, ప్రేక్షకాదరణ, సేల్స్.. ఇలా అన్ని అంశాలను దృష్టిలో వుంచుకొని ఓ బెస్ట్ ఆల్బంను సెలెక్ట్ చేస్తారు. అందులో భాగంగా ఈ ఏడాదికి దేవి సంగీతం అందించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రానికి ఆ అరుదైన గౌరవం దక్కింది. ఈ దెబ్బతో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర టీంకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించిదనే చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : son of satyamurthy  Apple selects  Best Album 2015  Devi Sri Prasad  Songs  

Other Articles