Prabhas Donation for Chennai floods victims

Prabhas donation for chennai floods victims

Prabhas Donates 15K for Chennai floods victims, Tollywood Heros Donates for Chennai, Tollywood Heros Donates for victims, Tollywood Heros Donates for floods victims, Donates for Chennai floods victims, Chennai floods victims, donations, tamil stars

Prabhas Donation for Chennai floods victims: Tollywood actors come forward to help the victims of Chennai floods and heroes started donation campaign for Chennai rains victims. prabhas, krishnam raju, shankarabharanam movie team and Tollywood Stars, Mahesh, NTR, Kalyan Ram, Sampoornesh Babu, Chennai Floods.

చెన్నై వరద బాధితులకు ప్రభాస్, శంకరాభరణం సాయం

Posted: 12/04/2015 09:59 AM IST
Prabhas donation for chennai floods victims

భారీ వర్షాల కారణంగా చెన్నై నగరమంతా అస్థవ్యస్థంగా తయారయ్యింది. నగరం అంతా కూడా వరద నీటితో నిండిపోయింది. ప్రజలకు సహాయం అందించడానికి ఇప్పటికే ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ వారు ముందుకొస్తున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు ఇప్పటికే విరాళాలను అందజేసారు. సంపూర్ణేష్ బాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రవితేజ, అల్లు అర్జున్, మహేష్ బాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్... తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటించారు.

సంపూర్ణేష్ బాబు – 50 వేల రూపాయలు
అల్లు అర్జున్ – 25 లక్షల రూపాయలు
ఎన్టీఆర్ – 10 లక్షల రూపాయలు
కళ్యాణ్ రామ్ – 5 లక్షల రూపాయలు
మహేష్ – 10 లక్షల రూపాయలు
రవితేజ – 5 లక్షల రూపాయలు
వరుణ్ తేజ్ – 3 లక్షల రూపాయలు
సాయిధరమ్ తేజ్ – 3 లక్షల రూపాయల ఆహారం, వైద్య సదుపాయాలు
సందీప్ కిషన్ – 5000 భోజనం ప్యాకెట్లు

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు కృష్ణంరాజు కలిసి 15 లక్షల రూపాయలు, ‘శంకరాభరణం’ చిత్ర యూనిట్ 5 లక్షల రూపాయలతో ఆహారం, వైద్య సదుపాయాలు, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 5 లక్షల రూపాయలు విరాళాలను ప్రకటించారు. ఇంకా కేవలం సినీతారలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా చెన్నై వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Donations  Chennai floods victims  Tamil heros  stills  

Other Articles