IIFA Utsavam | KCR | Postpone | Chennai floods victims

Telangana cm kcr postpone iifa utsavam 2015

KCR Talks about IIFA Utsavam 2015, KCR postponed IIFA Utsavam 2015, IIFA Utsavam Postponed, IIFA Utsavam Delay, IIFA Utsavam latest news, IIFA Utsavam postponed, KCR postponed IIFA Utsavam

Telangana CM KCR Postpone IIFA Utsavam 2015: Telangana CM KCR Decides to postpone the IIFA Utsavam 2015 Event in Hyderabad.

IIFA అవార్డుల వేడుక ఆపండి: కేసీఆర్

Posted: 12/03/2015 05:33 PM IST
Telangana cm kcr postpone iifa utsavam 2015

ఒకపక్క చెన్నైలో భారీ వర్షాల కారణంగా జనాలు కష్టాలు పడుతుంటే, మీరిక్కడ అవార్డులు తీసుకుంటూ డాన్సులు చేస్తారా? అనే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు స్పందించారు. హైదరాబాద్ లో ఈనెల 5,6 వ తేదిలలో ఐఫా IIFA (ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డుల వేడుకలు జరుగున్న విషయం తెలిసిందే.

ఈ అవార్డుల వేడుకలు ఇప్పటివరకు బాలీవుడ్ లో మాత్రమే జరిగేవి. కానీ మొదటిసారిగా సౌత్ ఇండియా సినిమాలను రిప్రజెంట్ చేస్తూ సౌత్ సినిమాలకు కూడా అవార్డులు ఇవ్వడానికి IIFA నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈ అవార్డుల కోసం నామినేషన్లను కూడా విడుదల చేసింది.

ఇదిలా వుంటే ఇటీవలే చెన్నైలో వరద తాకిడి రోజురోజుకి ఎక్కువ కావడం, భారీ వర్షాలు పడుతుండటంతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కనీస సదుపాయాలు లేక విలవిలలాడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో మన తెలుగు వారు సంబరాలు చేసుకోవడం సరైనది కాదని కేసిఆర్ అన్నారు.

ఈ విషయంపై గురువారం కేసిఆర్ స్పందిస్తూ... శుక్రవారం నుంచి నిర్వహించాల్సిన IIFA అవార్డుల వేడుకలను వాయిదా వేయాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా చెన్నైకి అండగా వుండాలని ఆయన పిలుపునిచ్చారు. కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ IIFA వేడుకలను జనవరికి వాయిదా వేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IIFA Utsavam  KCR  Postpone  Chennai floods victims  news  

Other Articles