Sampoornesh Babu | Donates | Chennai floods victims

Sampoornesh babu helps to chennai floods victims

Sampoornesh Babu Donates 50K for Chennai floods victims, Sampoornesh Babu Donates 50K, Sampoornesh Babu Donates for Chennai floods victims, Sampoornesh Babu helps to Chennai floods victims, Sampoornesh Babu helps, Sampoornesh Babu latest news, Sampoornesh Babu

Sampoornesh Babu Helps to Chennai floods victims: Tollywood actor burning star Sampoornesh Babu Donates 50K for Chennai floods victims.

ఆదర్శంగా నిలుస్తున్న బర్నింగ్ స్టార్... చెన్నై బాధితులకు సాయం

Posted: 12/02/2015 04:43 PM IST
Sampoornesh babu helps to chennai floods victims

గతకొద్ది రోజులుగా చెన్నైలో భారీ వర్షాల కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది చెన్నై ప్రజలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. తమిళ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు, సాంకేతికనిపుణులు సహాయసహాకారాలు అందించడానికి ముందుకొచ్చారు. ఈ అనుకోని సంఘటనకు తనవంతు సహాయాన్ని అందించడానికి టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ముందుకొచ్చారు.

గతంలో వైజాగ్ హుడ్ హుడ్ తుఫాను సమయంలో సూర్య, ధనుష్, విశాల్ వంటి తమిళ నటులు స్పందించి లక్షల రూపాయిల విరాళం అందించారు.....ఇప్పుడు అలాంటి విప్పత్తే చెన్నైని తాకింది. ఈ సమయంలో తోటి తెలుగు నటులు స్పందించి సాయం అందించాల్సిన సమయం వచ్చింది. నా వంతుగా రూ.50,౦౦౦ అందిస్తున్నాను. వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారికి కలిసి ఈ సాయాన్ని అందిస్తాను

సదా మీ ప్రేమకి బానిస
మీ సంపూర్నేష్ బాబు

Time to Support CHENNAI
When vizag is attacked by Hudhud cyclone, Actors like Surya, Dhanush, Vishal Donated and supported from Tamil Film Industry. Now Its our time to support. Iam donating a small amount of Rs.50,000/- to Tamil Nadu CM's Relief Fund.
PRAY FOR CHENNAI

Sadha mee premaki banisa
Mee sampoornesh babu

గతంలో వైజాగ్ ప్రాంతంలో హుదూద్ తుఫాను సంభవించినప్పుడు కేవలం మన తెలుగు వాళ్లే కాకుండా తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన సినీనటులు, ప్రముఖులు వారికి తోచినంత సహాయాన్ని అందించారు. అలాగే పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసి, విరాళాలను సేకరించారు. అలాంటి చెన్నై వారు ప్రస్తుతం వరదల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.

అలాంటి వారికి సాయం అందించాలనే మనసుతో సంపూర్ణేష్ ముందుకొచ్చారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి సంపూ ముందుగా ఇలాంటి సాయం చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. సంపూర్ణేష్ ను ఆదర్శంగా తీసుకొని, మిగతా ప్రముఖులు కూడా సాయం అందిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Donates  Chennai floods victims  Stills  News  

Other Articles