Bengal tiger movie release on 10 December

Bengal tiger movie release on 10 december

Bengal tiger movie release date confirmed, Bengal tiger movie release date, Shankarabharanam movie release date, Bengal tiger movie news, size zero movie release date, size zero movie news, Shankarabharanam movie news

Bengal tiger movie release on 10 December: Mass Maharaja Raviteja latest film Bengal tiger. This movie release date confirmed. This film will be release on 10 December. Size zero movie will be release on 27 november. Shankarabharanam movie will be release on 4 December.

సైజ్ జీరో కోసం బెంగాల్ టైగర్ త్యాగం

Posted: 11/17/2015 09:50 AM IST
Bengal tiger movie release on 10 december

ఈ మధ్య సినిమాలన్నీ వరుస పెట్టి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో రెండు, మూడు పెద్ద చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా వున్నాయి. అందాల భామ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సైజ్ జీరో’ చిత్రం ఈనెల 27న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో విడుదల కానున్న ఈ సినిమాకు ‘శంకరాభరణం’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాలు కూడా పోటీ పడుతున్నాయి.

అయితే ఈ మూడు చిత్రాల నిర్మాతలు ప్రసాద్.వి.పోట్లూరి(సైజ్ జీరో), కె.కె.రాధామోహన్(బెంగాల్ టైగర్), కోనవెంకట్(శంకరాభరణం)లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈ చిత్ర విడుదల తేదిల విషయాలపై ఓ క్లారిటీ ఇచ్చేసారు. ‘సైజ్ జీరో’ చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

అలాగే నిఖిల్ హీరోగా నటించిన ‘శంకరాభరణం’ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇక మాస్ మహారాజ రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’ చిత్రాన్ని దాదాపు రెండు వారాలపాటు వాయిదా వేసారు. ‘బెంగాల్ టైగర్’ చిత్రాన్ని డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengal tiger  release date  size zero  Shankarabharanam  movie news  

Other Articles