Salman Khan | Prem Ratan Dhan Payo | Prem Leela | Censor

Salman khan prem ratan dhan payo in censor trouble

Prem Ratan Dhan Payo telugu title trouble, Salman Khan Prem Leela in censor issues, Prem Leela in censor trouble, Salman Khan Prem Leela movie in censor trouble, Salman Khan Prem Ratan Dhan Payo stills, Salman Khan Prem Ratan Dhan Payo release date, Salman Khan Prem Ratan Dhan Payo songs, Salman Khan, Prem Ratan Dhan Payo

Salman Khan Prem Ratan Dhan Payo in censor trouble: Salman khan latest film Prem Ratan Dhan Payo. This film telugu version title Prem Leela. Sonam kapoor heroine.

ప్రేమ్ రథన్ విడుదలకు ప్రేమలీల అడ్డు

Posted: 11/05/2015 04:31 PM IST
Salman khan prem ratan dhan payo in censor trouble

సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘ప్రేమ్ రథన్ ధన్ పాయో’ సినిమా ఈనెల 12న దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సూరజ్ ఆర్ బరజాత్యా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమలీల’ పేరుతో విడుదల చేయనున్నారు. కానీ ఈ సినిమా విడుదలకు ప్రస్తుతం ఈ టైటిల్ అడ్డుగా నిలుస్తోంది.

‘ప్రేమలీల’ సినిమా టైటిల్ విషయంలో సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సెన్సార్ రూల్స్ ప్రకారం ఒక సినిమాను ఇతర భాషలలో విడుదల చేస్తే.. ఒరిజినల్ టైటిల్ తో విడుదల చేయాలి లేదా ఒరిజినల్ టైటిల్ కు అర్థం వచ్చేలా మరో టైటిల్ ను పెట్టి విడుదల చేయాలి. కానీ ‘ప్రేమలీల’కు అలా జరగలేదు.

ఒరిజినల్ టైటిల్ కాకుండా ఇలా వేరే అర్థం వచ్చే టైటిల్స్ పెట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా సెన్సార్ బోర్డు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ‘ప్రేమ్ రథన్ ధన్ పాయో’ నిర్మాతలు అలా చేయకుండా నేరుగా ‘ప్రేమలీల’ పేరుతో విడుదల చేయడానికి సిద్ధమైపోయారు. దీంతో ‘ప్రేమలీల’ చిత్ర సెన్సార్ కు టైటిల్ అడ్డుగా ఏర్పడింది. సెన్సార్ పూర్తయితే తప్ప సినిమా బుకింగ్స్, విడుదల రెండూ జరుగవు.

ఈ విషయంలో సెన్సార్ బోర్డు తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదని తేల్చేసింది. ఈ విషయంలో చిత్ర యూనిట్ ఓ వారం రోజుల ముందే గ్రహించి అప్లై చేసుకున్నా ఇప్పటికే ఈ సమస్య తీరిపోయుండేదని తెలుస్తోంది. మరి ఈ టైటిల్ సమస్యతో ఈ సినిమా ఆగిపోతుందో లేక కొత్త టైటిల్ పెట్టేసి విడుదల చేస్తారో అనే విషయం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు కూడా ఎక్కువ సమయం లేకపోవడంతో చిత్ర నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Prem Ratan Dhan Payo  Prem Leela  Censor Trouble  Stills  

Other Articles