Dilwale | Shahrukh khan | kajol | tension

Shahrukh khan and kajol in tension

Shahrukh khan kajol in tension, Shahrukh khan in tension, Dilwale movie news, Dilwale movie stills, Dilwale stills, Dilwale posters, Dilwale audio date, Dilwale Shahrukh khan, Dilwale

Shahrukh khan and kajol in tension: Bollywood hero Shahrukh khan and kajol upcoming film Dilwale. This film Audio will be release on 11 november.

దిల్ వాలే జోడికి టెన్షన్ టెన్షన్

Posted: 11/05/2015 05:22 PM IST
Shahrukh khan and kajol in tension

బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడి షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ వాలే’. చెన్నై ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత షారుక్, రోహిత్ శెట్టి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇందులో నటించే షారుక్, కాజోల లకు ప్రస్తుతం ఓ విషయం టెన్షన్ పెడుతోంది.

మహారాష్ట్ర ప్రభుత్వం గుట్కా యాడ్స్ లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే గుట్కా యాడ్స్ లో నటించిన షారుక్ ఖాన్ మరియు కాజోల్ భర్త, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ లకు మహారాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో వుంది. ఒకవేళ నోటీసులు అందితే ఏ విధంగా ముందుకు వెళ్లాలో అనే విషయంపై ఇప్పటికే వీరి న్యాయనిపుణులతో షారుక్, కాజోల్ లు సంప్రదింపులు జరుపుతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రీతమ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను దీపావళి సంధర్భంగా నవంబర్ 11న విడుదల చేయనున్నారు. త్వరలోనే సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dilwale  Shahrukh khan  kajol  tension  stills  

Other Articles