Kona Venkat | Srinu Vaitla | Angry | Fires

Kona venkat rs 10 crore defamation suit on srinu vaitla

Kona Venkat fires on Srinu Vaitla, Kona Venkat angry on Srinu Vaitla, Kona Venkat comments on Srinu Vaitla, Kona Venkat demonds 10 crores from Srinu Vaitla, Kona Venkat latest news, Kona Venkat latest press meet, Kona Venkat interviews, Kona Venkat angry, Kona Venkat hot comments, Kona Venkat

Kona Venkat Rs 10 Crore Defamation Suit on Srinu Vaitla: Director Srinu vaitla latest film Brucelee the fighter. Kona Venkat script writer. As per latest news... Kona venkat demonds 10 crores money from srinu vaitla.

శ్రీనువైట్లపై కోన గరం గరం... పైసలు ఇచ్చుడే.. సారీ చెప్పుడే!

Posted: 10/29/2015 03:39 PM IST
Kona venkat rs 10 crore defamation suit on srinu vaitla

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రం ద్వారా విడిపోయిన శ్రీనువైట్ల-కోన వెంకట్ లు మళ్లీ కలిసారని అందరూ అనుకునేలోపే మళ్లీ వీరి విభేధాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గతంలో శ్రీనువైట్ల తెరకెక్కించిన పలు చిత్రాలకు కోనవెంకట్, గోపిమోహన్ కథ, మాటలను అందించి, సినిమా విజయాలకు కారకులుగా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ‘బాద్ షా’ సినిమాతో వీరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత కోన, గోపిల సహాయం లేకుండానే శ్రీనువైట్ల ‘ఆగడు’ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ వీరి ముగ్గురి కలయికలోనే సినిమా చేయాలని రాంచరణ్ పట్టుబట్టి మరీ ‘బ్రూస్ లీ’ సినిమాను చేసారు. అయితే ఈ సినిమా ఇటీవలే విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇదిలా వుంటే తాజాగా శ్రీనువైట్లపై కోనవెంకట్ పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమయ్యారు. ‘బ్రూస్ లీ’ సినిమా కోసం తాను రాసిన కథ ఒకటైతే.. శ్రీనువైట్ల తీసిన కథ మరొకటని, కథ మొత్తం మార్చేసి శ్రీనువైట్ల తనకు నచ్చినట్లుగా తీసేసాడని కోనవెంకట్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా రషెస్ కూడా తనకు చూపించలేదని ఆరోపిస్తున్నాడు కోనవెంకట్.

తన స్టోరీని ఈ సినిమాలో వాడనందుకుగాను నష్టపరిహారంగా 10కోట్ల రూపాయలు చెల్లించి, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ కోనవెంకట్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లడానికి కూడా కోన వెంకట్ సిద్ధంగా వున్నారు. మరి ఈ సమస్యపై శ్రీనువైట్ల ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kona Venkat  Srinu Vaitla  Angry  Fires  Comments  10 crores  Movie News  

Other Articles