Baahubali 2 | VFX Specialist | RC Kamalkannan

Vfx specialist rc kamalkannan for baahubali 2

VFX specialist Changed for Baahubali 2, RC Kamalkannan VFX specialist for Baahubali 2, RC Kamal kannan for Baahubali 2, Baahubali 2 vfx details, Baahubali 2 latest news, Baahubali 2 movie news, Baahubali 2 movie updates, Baahubali 2 stills, Baahubali 2

VFX specialist RC Kamalkannan for Baahubali 2: SS Rajamouli upcoming film Baahubali 2. VFX specialist Srinivas mohan exit from this project.

ఈగ స్పెషలిస్ట్ తో బాహుబలి2 గ్రాఫిక్స్

Posted: 10/29/2015 10:41 AM IST
Vfx specialist rc kamalkannan for baahubali 2

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ తో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు.

‘బాహుబలి’ చిత్రానికి శ్రీనివాస్ మోహన్ విజువల్ ఎఫెక్ట్స్ ను అందజేసారు. కానీ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి2’ చిత్రం నుంచి శ్రీనివాస్ మోహన్ తప్పుకున్నారు. శ్రీనివాస్ పలు ఇతర సినిమాలతో బిజీగా వుండటం వలన ‘బాహుబలి2’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లుగా తెలిసింది.

అయితే ‘బాహుబలి2’ కోసం ప్రముఖ నేషనల్ అవార్డు విన్నర్, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్ట్ ఆర్.సి.కమల్ కన్నన్ ను ఎంపిక చేసారు. గతంలో రాజమౌళి తీసిన ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’ చిత్రాలకు కమల్ కన్నన్ పనిచేసారు. త్వరలోనే ఈ ప్రాజెక్టులో కమల్ చేరనున్నారు. ప్రస్తుతం ‘బాహుబలి2’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  VFX Specialist  RC Kamalkannan  SS Rajamouli  

Other Articles