Omkar celebrating dasara in Raju Gari Gadi

Omkar celebrating dasara in raju gari gadi

Raju Gari Gadi, Raju Gari Gadi cinema, Omkars Raju Gari Gadi, Raju Gari Gadi News, Raju Gari Gadi updates, Omkar, Director Omkar, Raju Gari Gadi collections

If trade reports are anything to go by, director Ohmkar's latest offing Raju Gari Gadi is being received well by audience. Especially, the talk is that the movie is getting good applause from B & C Centres. Thanks to right dose of horror and comedy elements, the film is said to be pulling crowds.

రాజుగారి గదిలో ఓంకార్ సంబరాలు

Posted: 10/23/2015 11:32 AM IST
Omkar celebrating dasara in raju gari gadi

యాంకర్ గా తనను తాను నిరూపించుకున్న ఓంకార్.. సినిమా డైరెక్టర్ గా సక్సెస్ అందుకోలేదు. జీనియస్ సినిమా ప్లాఫ్ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. లేట్ గా వచ్చినా కానీ మంచి సినిమాతో ముందుకు వచ్చారు ఓంకార్. రాజు గారి గది సినిమా చిన్న సినిమానే కానీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ లతో దూసుకెళుతోంది. దసరా సందర్భంగా విడుదలైన రాజు గారి గది సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. అద్భుతమైన కథతో... అదిరిపోయే సినిమాటోగ్రఫీ, మంచి మ్యూజిక్ తో ఆడియన్స్ చేత శభాష్ అనిపించింది. సినిమా హిట్ టాక్ సంపాదించడమే కాకుండా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తోంది.

హర్రర్, కామెడీ సినిమాగా వచ్చినే రాజు గారి గదితో ఓంకార్ బంపర్ ఆఫర్ అందుకున్నారు. అటు తనను తాను డైరెక్టర్ గా నిరూపించుకోవడంతో పాటు తన తమ్ముడు అశ్విన్ ను హిట్ సినిమా ద్వారా లాంచ్ చెయ్యడమే కాకుండా కెరీర్ కు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. ఈ సినిమాలో షకలక శంకర్, ధన్ రాజ్, సప్తగిరిల కామెడీ సీన్ లు ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ అదిరిపోవడంతో.. రాజు గారి గది సినిమా ధియేటర్ల సంఖ్యను పెంచాలని నిర్మాతలు సాయి కొర్రపాట, అనిల్ సుంకర నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి రాజు గారి గది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles