Balakrishna Dictator movie teaser released

Balakrishna dictator movie teaser released

Dictator, Dictator Movie, Dictator News, Dictator stills, balakrishnas Dictator, Balayyas Dictator, Dictator Teaser, Dictator New looks

After a lot of dilly dallying, finally the teaser of Nandamuri Balakrishna's forthcoming film Dictator has been unveiled. Much to the delight of fans, Balayya looking absolutely stylish, dynamic ever. The one-minute-odd teaser gives a sense of complete commercial entertainer with good dose of action, comedy. Balayya's trademark punch liners are said to be one of the highlights of the actor's 99th film. Dialogues like, "Nee History Lo Blood Vundemo, Na Blood Ke History Vundi", "Madyam Tagadam Aarogyaniki Hani Karam, Na Lanti Vanni Rechcha Kottadam Jeevitanike Pramadakaram", these are treat to hear from Balayya.

కొత్త లుక్ లో బాలయ్య.. డిక్టేటర్ టీజర్ అదిరింది

Posted: 10/23/2015 11:56 AM IST
Balakrishna dictator movie teaser released

నందమూరి బాలకృష్ణ తాజా సినిమా డిక్టేటర్ టీజర్ విడుదలైంది. గతంలో కన్నా చాలా హ్యాండ్సమ్ గా బాలయ్య బాబు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. శ్రీవాప్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య బాబు పర్సనాలిటీ సినిమాకు మరింత అందాన్ని.. హైప్ ను తీసుకువచ్చింది. ఎప్పటి లాగానే సినిమా టీజర్ లో మాస్ డైలాగ్ లతో అదరగొట్టారు బాలయ్య. నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో.. కానీ నా బ్లడ్ కే హిస్టరీ ఉంది అన్న డైలాగ్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టిస్తోంది. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.. నాలాంటి వాడిని రెచ్చగొట్టడం జీవితానికి ప్రమాదకరం అన్న డైలాగ్ బాలయ్య డైలాగ్ డెలివరి కెపాసిటిని పెంచింది.

డిక్టేటర్ సినిమా టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసిన డిక్టేటర్ సినిమా యూనిట్.. తాజాగా టీజర్ ను విడుదల చేసి నందమూరి ఫ్యాన్స్ పల్స్ ను పెంచింది. ఫ్యాన్స్ ఆశించే మాస్ డైలాగ్ లను అందిస్తూనే.. బాలయ్యను చాలా కొత్తగా చూపించారు డైరెక్టర్ శ్రీవాస్. అంజలి, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా చేస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ లు డిక్టేటర్ సినిమా కోసం బాలయ్యతో కలిసి పని చేస్తున్నారు. శ్రీవాస్, ఏరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సహకారంతో డిక్టేటర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వచ్చే సంక్రాంతి పండగకు విడుదల కానున్న డిక్టేటర్ ఇప్పుడే బాలకృష్ణ ఫ్యాన్స్ పల్స్ ను పెంచేసింది. మరి సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles