Akkineni | Akhil | Platinum Disc | Sayesha saigal

Akhil movie release postponed

Akhil Movie Release Date Postponed, Akhil Movie Platinum Disc celebrations on 17 October, Akhil Movie Tamil version title, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie First Look Teaser, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akhil Movie Release Postponed: Akhil Akkineni latest film Akhil. VV Vinayak Direction. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors. Akhil platinum disc celebrations in Vizag on 17 October.

వాయిదా పడ్డ అక్కినేని అఖిల్ సినిమా

Posted: 10/16/2015 11:41 AM IST
Akhil movie release postponed

వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్, సయేశా సైగల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘అఖిల్’. ‘పవర్ ఆఫ్ జువా’ ట్యాగ్ లైన్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

అనూప్ రూబెన్స్, థమన్ సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సంధర్భంగా ‘అఖిల్’ ప్లాటినం డిస్క్ వేడుకను వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రం ఆడిటోరియంలో ఈనెల 17న సాయంత్రం 6గంటలకు జరుపనున్నారు.

అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 22న దసరా కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజాగా కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. చిత్ర నిర్మాత నితిన్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. “గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం కారణంగా అఖిల్ సినిమాను అక్టోబర్ 22న విడుదల చేయలేకపోతున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం” అని ట్వీట్ చేశారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ‘సూర్య కవచం’ అనే టైటిల్ ఖరారు చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni  Akhil  Platinum Disc  Sayesha saigal  movie news  

Other Articles