Brucelee the fighter | Chiranjeevi | Ram charan | Reviews

Megastar chiranjeevi entry response in ram charan brucelee film

Megastar chiranjeevi entry rocks in Brucelee film, Megastar chiranjeevi entry in Brucelee film, Chiranjeevi entry rocks in Brucelee film, Brucelee the fighter public talk, Brucelee the fighter reviews, Brucelee the fighter telugu review, Brucelee the fighter movie news, Brucelee the fighter collections, Brucelee the fighter, Ram charan, Chiranjeevi

Megastar chiranjeevi entry response in Ram charan Brucelee film: Mega Powerstar Ramcharan latest film Brucelee the fighter. This film released today. Megastar chiranjeevi acts an important role. Rakul preet singh heroine.

మెగాస్టార్ ఎంట్రీకి థియేటర్లు గోల గోల... పాజిటివ్ టాక్ తో ‘బ్రూస్ లీ’

Posted: 10/16/2015 10:27 AM IST
Megastar chiranjeevi entry response in ram charan brucelee film

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రూస్ లీ’ చిత్రం నేడు (అక్టోబర్ 16) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత రాంచరణ్ మరోసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడని చెప్పుకోవచ్చు.

శ్రీనువైట్ల తనదైన శైలిలో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రచయితలు కోనవెంకట్-గోపిమోహన్ లు ‘బ్రూస్ లీ’ చిత్రానికి ఓ పవర్ ఫుల్ కథను అందించారు. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చరణ్ ఇందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

చరణ్ స్టైల్, డాన్సులు, యాక్షన్ సన్నివేశాలకు మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో వున్నారు. ఇక చరణ్, రకూల్ ప్రీత్ సింగ్ ల కెమిస్ట్రీ ఇందులో బాగా వర్కౌట్ అయ్యింది. థమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. విజువల్స్ పరంగా సినిమాలో ఇంకా అదరగొడుతున్నాయి.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్... సినిమాకు గెస్ట్ అప్పియరెన్స్ అనుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ‘బ్రూస్ లీ’ చిత్రానికి బూస్టర్ లా మారారు. సెకండ్ హాఫ్ లో మెగాస్టార్ ఎంట్రీకి థియేటర్ దద్దరిల్లింది. మెగా అభిమానులు మాత్రం మెగాస్టార్ ఎంట్రీకి ఫుల్ ఖుషీ అయ్యారు.

దాదాపు ఏడెళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ వెండితెర మీద కనిపించడంతో అభిమానులు ఆనందంతో కనిపించారు. ఇక సినిమాలో చిరంజీవి ఎంట్రీ అద్భుతంగా వుంది. సెకండ్ హాఫ్ లో చిరంజీవి ఎంట్రీకి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇందులో మెగాస్టార్ లుక్స్, స్టైల్, యాక్టింగ్, డైలాగ్స్ కేక పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా చరణ్-చిరులు గుర్రాలపై వస్తుంటే ఆ విజువల్స్ సూపర్బ్.

మెగాస్టార్ పాత్ర కనిపించేది కేవలం 5 నిమిషాలే అయినప్పటికీ... సినిమాకు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టారు. మెగా అభిమానులు మాత్రం ఆనందంతో దసరా పండగను నేడే చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Brucelee the fighter  Chiranjeevi  Ram charan  Reviews  Public talk  

Other Articles