Brucelee the fighter | Srinu Vaitla | Dream project

Srinu vaitla dream project with pawan and mahesh

Srinu vaitla dream project with pawan kalyan and mahesh babu, Srinu vaitla dream project, Srinu vaitla interview, Srinu vaitla press meet, Brucelee the fighter movie news, Brucelee the fighter movie updates, Brucelee the fighter tickets, Brucelee the fighter stills, Brucelee the fighter trailers, Brucelee the fighter

Srinu vaitla dream project with pawan and mahesh: Director srinu vaitla latest film Brucelee the fighter. This film will be release on 16 oct.

వాళ్లు సయ్యంటే మల్టీస్టారర్ కు సిద్ధమంటున్న శ్రీనువైట్ల

Posted: 10/15/2015 05:55 PM IST
Srinu vaitla dream project with pawan and mahesh

టాలీవుడ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘బ్రూస్ లీ-ది ఫైటర్’. రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 16వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు.

దర్శకుడు ఈ చిత్ర విశేషాలను తెలియజేస్తూ తాజాగా తన డ్రీం ప్రాజెక్టు గురించి తెలియజేసారు. శ్రీనువైట్ల తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం చేయాలనేది తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే మహేష్ తో ‘దూకుడు’, ‘ఆగడు’ వంటి చిత్రాలను తీసిన శ్రీనువైట్ల... పవన్ కళ్యాణ్ కోసం ఓ స్ర్కిప్టు రెడీగా వుందని చెప్పుకొచ్చాడు. అయితే మహేష్, పవన్ లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారితో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తీయాలనుందని శ్రీనువైట్ల చెప్పుకొచ్చాడు.

మరి పవన్, మహేష్ లు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి. అయినా వీరిద్దరూ కలిసి చేస్తున్నారంటే ఆ సినిమా ఏ రేంజులో వుండబోతుందోనని అంచనాలు ‘బాహుబలి’ స్థాయిని మించిపోతాయి. మరి ఆ అంచనాలను శ్రీనువైట్ల అందుకుంటాడో లేదో భవిష్యత్తులోనే చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brucelee the fighter  Srinu Vaitla  Dream project  Pawan kalyan  mahesh babu  

Other Articles