Nag completes shoot for Akhil’s intro song

Nagarjuna work is over with akhil

akhil akkineni, akhil akkineni debut movie, akhil nitin movie, Akhil latest news, Akhil movies, Akhil photos, Akhil debut movie, Akkineni Akhil dubut movie, Akkineni Akhil debut heroine, Akkineni Akhil latest updates, Akkineni Akhil movie news, Akkineni Akhil cinema News, Akkineni Akhil upcomming movies, Akkineni Akhil new look, akhil akkineni, nagarjuna, naga chaitanya, nitin, vv vinayak

Akkineni Nagarjuna’s son, Akhil Akkineni stormed into Tollywood with his widely appreciated cameo in ANR’s family film Manam and now he is all set to make his debut with ‘Akhil’.

అఖిల్ తో నా పనైపోయిందన్న నాగార్జున

Posted: 10/11/2015 06:44 PM IST
Nagarjuna work is over with akhil

అక్కినేని నటవారసుడిగా వస్తున్న నాగచైతన్య తరువాత ఎంట్రీ ఇస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో యంగ్ హీరో అఖిల్ అక్కినేని.. మొట్టమొదటి సినిమా ‘అఖిల్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది, అఖిల్ తో పాటు హీరోయిన్ గా సయేషా సైగల్ పరిచయం అవుతున్న ఈ సినిమాని నితిన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

అయితే మాస్ హీరోగా ఓ రేంజ్ లో ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకునేందుకు అఖిల్ చాలానే కష్టపడుతున్నాడు. ఇందుకోసం ఈ సినిమాలో అఖిల్ పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని మాత్రం గత కొద్ది రోజులుగా షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో అఖిల్ తో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్యలు కూడా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సెట్ షూటింగ్ లో నాగార్జునపై వచ్చే పార్ట్ ని షూట్ చేసారు.

అఖిల్ – నాగార్జున పార్ట్ చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఇక ఈ సాంగ్ లో నాగ చైతన్యపై షూట్ చేసే సీన్స్ మాత్రం ఇంకా షూట్ చేయాల్సి ఉంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇదిలా ఉంటే మరోవైపు వివి వినాయక్ మిగిలిన్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. అలాగే అఖిల్ కి గ్రాండ్ లాంచ్ ఇవ్వడం కోసం, మొదటి సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా గ్రాండ్ ప్రమోషనల్ టూర్ ని ప్లాన్ చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Akhil  debut movie  nagarjuna  Akkineni Akhil latest updates  

Other Articles