first day collections hit for tollywood movie rudramadevi

Good responce for rudrama devi

rudhramadevi collection reports,rudhramadevi overseas collections,rudhramadevi movie news,rudhramadevi news,rudhramadevi cinema news, gunashekar rudrama devi, allu arjun, rana, anushka shetty,

good responce for rudrama devi at box office as first day collections cross 9 crores

కలెక్షన్లను రాబడుతున్న రుద్రమదేవి

Posted: 10/11/2015 05:35 PM IST
Good responce for rudrama devi

కాకతీయ వీరణారి రాణీ రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు అధరించడంతో.. బాక్సిఫీసు వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుద్రమదేవిలో లీడ్ రోట్ పోషించిన అనుష్క, సహా అల్లు అర్జున్, రానా దగ్గుబాటి వంటి స్టార్ నటీనటులు వుండటంతో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు టాక్ అటు ఇటుగా వచ్చినా సినిమాకి మాత్రం ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. మొదటి రోజు ఆంధ్ర, తెలంగాణలో కలుపుకొని 9 కోట్ల పైనే షేర్ సాధించిన రుద్రమదేవి రెండవ రోజు కూడా దాదాపుగా 5 కోట్ల పైనే షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. అన్ని ఎరియల్లోనూ మంచి కలెక్షన్స్ వస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.

ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రుద్రమదేవి సినిమా ఓవర్సీస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. ప్రీమియర్ షోస్ మరియు మొదటి రోజు కలిపి $305,908K (1.98కోట్లు) సాధించిన రుద్రమదేవి రెండవ రోజు అనగా శనివారం $203K షేర్ సాధించింది. అనగా మొదటి రెండు రోజుల్లో రుద్రమదేవి హాఫ్ మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. ఓవరాల్ గా మొదటి రెండు రోజుల్లో సుమారు $508,908K (3.2 కోట్లకి పైనే) సాధించింది. ఈ రోజు కూడా ఇదే జోరును కొనసాగిస్తోందని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఓవర్సీస్ లో 2డి కంటే 3డి కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. లోకల్ లో కూడ 3డి వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gunashekar  rudrama devi  anushka shetty  allu arjun  rana  

Other Articles