‘బాహుబలి’ చిత్రంలో నటించిన తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ‘యూనివర్సల్ స్టార్’ హోదా సంపాదించేసుకున్నాడు. నిన్నటిదాకా టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని తనవైపుకు ఆకర్షించుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘బాహుబలి’ ప్రభాస్ స్థాయిని హాలీవుడ్ హీరో రేంజుకు తీసుకెళ్లింది. అందుకే.. ఇతని ఇమేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం కొన్ని కంపెనీలు తమ ప్రోడక్టులకు అతనిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే పలు కంపెనీలు ప్రభాస్ ని సంప్రదించగా.. అందులో మహీంద్రా అండ్ మహీంద్రాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగానే ప్రభాస్ తొలిసారిగా నటించిన యాడ్ లో దుమ్మురేపేశాడు.
మహీంద్రా కంపెనీ కొత్త మోడల్ TUV300కు బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ యాడ్ కు సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ విడుదల కాగా.. ఇప్పుడు తాజాగా వీడియోను రిలీజ్ చేశారు. మహీంద్రా TUV300తో ప్రభాస్ తనదైన స్టైల్ లో దూసుకుపోతూ యాడ్ లో ఇరగదీశాడు. ఈ వీడియోపై అప్పుడే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అన్న ప్రభాస్ ఎంతకష్టమైన పనినైనా చిటికెలో చేసేస్తాడంటూ భల్లాలదేవ ట్వీటిచ్చాడు. అంతేకాదు మహేంద్ర కార్ యాడ్ ను పోస్ట్ చేశాడు. ఈ యాడ్ కోసం చిత్రీకరణకు ఇటీవల భారీ షూట్ జరిగిన సంగతి తెలిసిందే. క్రేజీ యాడ్ ఫిలిం మేకర్ పర్వేజ్ షేక్ ఈ యాడ్ ను రూపొందించారు. ఇక ఈ యాడ్ చివరలో ‘వన్ మోర్’ అంటూ ప్రభాస్ చెప్పి.. అభిమానులకు మరింత కిక్ ఇచ్చాడు. ఈ కంపెనీకి సంబంధించి మరో యాడ్ కూడా రావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. నిన్నటిదాకా వెండితెర మీద తన సత్తా చాటిన ప్రభాస్.. ఇక నుంచి బుల్లితెర మీద యాడ్ ల ప్రేక్షకుల్ని అలరించనున్నాడని చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more