daggubati rana | Prem Rakshit | News | movies | stills

Prem rakshit direction with daggubati rana

Prem Rakshit film with daggubati rana, daggubati rana movie news, daggubati rana movies, daggubati rana stills, daggubati rana news, daggubati rana movie details, daggubati rana, prem rakshith, news, stills

Prem Rakshit direction with daggubati rana: Dance choreographer Prem Rakshit become director with daggubati rana. rana latest movie news, gossips, stills, gallery.

ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో భల్లాలదేవ

Posted: 09/28/2015 01:52 PM IST
Prem rakshit direction with daggubati rana

'యమదొంగ' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'నాచోరే నాచోరే..' అంటూ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసి, భారీగా క్రేజ్ ను దక్కించుకున్నాడు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్. తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్, అగ్ర, యువ హీరోలకు స్టెప్పులు కంపోజ్ చేసి, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ 10 కొరియోగ్రాఫర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

అయితే ఈ మధ్య కొరియోగ్రాఫర్లు కూడా దర్శకులుగా మారుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రేమ్ రక్షిత్ కూడా దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఓ మంచి కథను సిద్ధం చేసుకున్నాడు. ఇటివలే ఈ కథను దగ్గుబాటి రానాకి వినిపించి, రానా చేత గ్రీన్ సిగ్నల్ దక్కించుకున్నాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సురేష్ బాబు తన సొంత బ్యానర్లో నిర్మించనున్నారు. రానా సరసన రెజీన కసాండ్ర ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది మొదట్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరి ఇప్పటివరకు తన డాన్సులతో అలరించిన ప్రేమ్ రక్షిత్... దర్శకుడిగా ఎలాంటి విజయం సాధిస్తాడో చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : daggubati rana  Prem Rakshit  News  movies  stills  

Other Articles