Chiranjeevi gift to SreenuVaitla

Sreenu vaitla got wonderful gift form chiranjeevi

Chiranjeevi, Sreenu Vaitla, Brucle lee, Ramcharan, Chiaranjeevi Gift, Chiaranjeevi News, Chiaranjeevi stills, Chiaranjeevi new film, Chiaranjeevi updates, Chiaranjeevi latest stills, Chiaranjeevi Next film, Chiaranjeevi updates, Chiaranjeevis film with sreenuVaitla, Sreenu Vaitla News

Mega star Chiranjeevi gifrted a gift on Sreenu Vaitlas Birth Day. Sreenu Vaitla already directing Ramcharans Brucelee film. After a long gap chiranjeevi.. entering into cinemas.

శ్రీనువైట్లకు చిరంజీవి ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్

Posted: 09/25/2015 12:27 PM IST
Sreenu vaitla got wonderful gift form chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నుండి అద్భుతమైన బర్త్ డే కానుకను అందుకున్నట్లు డైరెక్టర్ శ్రీను వెల్లడించారు. మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఇప్పటికే బ్రూస్ లీ సినిమా తీస్తున్న శీనువైట్ల తన బర్త్ డే సందర్భంగా మెగా గిఫ్ట్ అందించారు. రామ్ చరణ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ సినిమాలోని ఓ పాటను శీనువైట్ల బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. లే ఛలో అనే పాట ఇప్పటికే యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. అయితే అన్నింటి కన్నా కూడా మెగాస్టార్ ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయిందని శ్రీనువైట్ల కితాబిస్తున్నారు. అసలు ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా..?

యాక్షన్ లో కామెడీతో తెలుగు సినిమా స్టైల్ ను మార్చిన శ్రీనువైట్లకు ఈ బర్త్ డే రోజు అద్భుతమై గిఫ్ట్ అందిందట. ఇదే విషయాన్ని డైరెక్టర్ శ్రీనువైట్ల స్వయంగా ప్రకటించారు. చిరంజీవిగారిచ్చిన గిఫ్ట్ ఎన్నటికీ మరిచిపోలేనని అన్నారు. అయితే అసలు ఆ గిఫ్ట్ ఏంటంటే.. చిరంజీవి సినిమాకు శ్రీనువైట్ల డైరెక్షన్ చెయ్యడం. అవును చాలా కాలం తర్వాత చిరంజీవి తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మెగాస్టార్ అను డైరెక్ట్ చేసే అవకాశం ఎవరికి వస్తుందా అని అందరూ ఎదరు చూశారు. మొత్తానికి శ్రీనువైట్ల ఆ అవకాశాన్ని కొట్టేశారు. ఇది తన బర్త్ డే గిఫ్ట్ అన్నింటిలోకి మరిచిపోలేనిదని శ్రీనువైట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Sreenu vaitla  

Other Articles