Shivam Censor completed

Shivam censor completed

Ram, Shivam, Rashi Khanna, Srinivas Reddy, Devi Sri Prasad, Sri Sravanthi Movies, Shivam news, Shivam release date, Shivam latest, Shivam censor news, Shivam posters, Shivam trailer

Energetic Ram has recently wrapped the shoot of his upcoming movie Shivam recently. Srinivas Reddy is making his directorial debut with Shivam which is said to be a high voltage love story with enough loads of action. Rashi Khanna played the female lead in the movie and the movie unit has recently returned back from Europe after shooting for three songs. The movie is currently busy with the post production work and Ram has recently wrapped the dubbing work for the movie. He has been back to success league with Pandaga Chesko which released recently

రామ్ ‘శివం’ సెన్సర్ పూర్తి

Posted: 09/25/2015 10:28 AM IST
Shivam censor completed

మోస్ట్ ఎనర్జిటిక్ హీరో రామ్ తాజా చిత్రం శివం సెన్సార్ పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న శివం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. రామ్ కు జోడీగా రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న శివం సినిమా పూర్తి యాక్షన్ లవ్ స్టోరీగా ఉండబోతోంది. రామ్ సినిమాలో ఎంత ఎనర్జిటిక్ యాక్షన్ ఉంటుందో.. సినిమా చివరి వరకు కూడా అదే ఎనర్జీని కొనసాగించడం టాలీవుడ్ లో చాలా మందికి నచ్చే అంశం. అనుకున్న స్థాయి హిట్ లేని రామ్.. శివం సినిమా కోసం బాగా కష్టపడ్డారట. శివం సినిమాలోని మూడు పాటలను షూట్ చెయ్యడానికి యూరప్ వెళ్లి రీసెంట్ గా తిరిగివచ్చారు.

పండగ చేస్కో సినిమా తర్వాత రామ్ నటించిన తాజా చిత్రం శివం.. సెన్సార్ పూర్తి చేసుకుంది. కొన్ని చిన్న చిన్న కట్ లు మాత్రమే చేసకొని శివం సినిమా U/A సర్టిఫికేట్ పొందింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియోకు ఇప్పటికే మంచి క్రేజ్ రావడంతో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది. శివం సినిమాకు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivam  Ram  

Other Articles