Director Bobby Tweeted That Pawan Kalyan Soon Joining Gabbar Singh 2 Shooting | Pawan Kalyan News

Power star pawan kalyan to join gabbar singh 2 movie shooting director bobby

pawan kalyan, power star news, pawan kalyan updates, pawan kalyan twitter, director bobby, director bobby news, bobby twitter, pawan kalyan latest news, pawan kalyan controversy, gabbar singh 2 movie, gabbar singh 2 updates

power star pawan kalyan to join gabbar singh 2 movie shooting director bobby: Director Bobby Tweeted That Pawan Kalyan will join Gabbar Singh 2 Shooting on july 29 in their latest schedule.

పవర్ స్టార్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

Posted: 07/25/2015 11:28 AM IST
Power star pawan kalyan to join gabbar singh 2 movie shooting director bobby

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతకొన్నాళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్ని పరిణామాల, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో ఫుల్ బిజీగా గడుపుతుండటంతో.. ఆయన ‘గబ్బర్ సింగ్-2’ చిత్రం మరింత ఆలస్యం అవుతుందని భావించారు. పైగా.. పవన్ తన సినిమా గురించి ఒక్కమాట కూడా మాట్లాడని నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ క్లోజ్ అయిందేమో భావించారు. ఇంతలోనే ఇటీవల పవన్ ‘సర్దార్’ టైటిల్ తో కూడిన మరో మూవీలో నటిస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. దీంతో పవన్ తన గబ్బర్-2 ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాడేమోనన్న ప్రచారాలు జోరుగా సాగాయి. మరోవైపు.. ‘గబ్బర్ సింగ్-2’ కాకుండా ‘సర్దార్’ టైటిల్ ని ఫిక్స్ చేశారని వార్తలు కూడా వచ్చాయి. నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైనప్పటికీ.. పవన్ ఇతర కార్యకలాపాలతో బిజీగా వుండటంతో ఇలా గాసిప్పులు ఒకదానిమీద మరొకటి పుట్టుకొచ్చేస్తున్నాయి. అయితే.. ఆ ప్రచారాలను తిప్పికొడుతూ దర్శకుడు బాబీ తాజాగా స్పందించాడు.

‘గబ్బర్ సింగ్-2’ చిత్రాన్ని ‘పవర్’ మూవీ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే! తాజాగా ఇతను ఈ సినిమాకి సంబంధించి తన ట్విటర్ లో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘పవర్ స్టార్ అభిమానులందరికీ ఓ గుడ్ న్యూస్. మా సినిమా తదుపరి షెడ్యూల్ జూలై 29 నుంచి ప్రారంభం కానుంది. అప్పటినుంచి పవన్ కల్యాణ్ కూడా చిత్రీకరణలో పాల్గొననున్నారు’ అని ట్వీట్ చేశాడు. అయితే.. తమ సినిమా టైటిల్ ని మాత్రం బాబీ వెల్లడించలేదు. ఈ సినిమా ‘గబ్బర్ సింగ్-2’ లేదా ‘సర్దార్’ టైటిళ్లలో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. యంగ్ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో విలన్ గా మరాఠీ నటుడు శరత్ కేల్కర్ నటిస్తున్నాడు. జూలై 29వ తేదీ నుంచి గుజరాత్ లో ప్రారంభం కానున్న తదుపరి షెడ్యూల్ దాదాపు 40 రోజులపాటు శరవేగంగా షూటింగ్ జరుగనుందని సమాచారం. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

director-bobby-twitter

ఇదిలావుండగా.. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గతకొద్ది రోజులుగా బెంగళూర్ లో తన బాడీని ఫిట్ గా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ‘గబ్బర్ సింగ్’ కంటే మరింత అద్భుతంగా ఈ సీక్వెల్ సినిమాని తెరకెక్కించాలని భావించిన పవన్.. ఆ దిశగానే తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  director bobby  gabbar singh 2  

Other Articles