Dil Raju to Produce Ntr Next Film

Dil raju to produce ntr next film

NTR Next Film With Producer Dil Raju, Dil Raju NTR movie news, Dil Raju latest news, Dil Raju news, Dil Raju upcoming films, NTR latest news, NTR film news, NTR film updates, NTR upcoming films, NTR movie details, NTR

Dil Raju to Produce Ntr Next Film: Producer Dil Raju officially announced that he will produce a film with young tiger NTR. Movie will be starts in Jan 2016.

ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు హ్యట్రిక్ చిత్రం

Posted: 07/16/2015 11:40 AM IST
Dil raju to produce ntr next film

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘బృందావనం’, ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రాలొచ్చాయి. తాజాగా వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారు. ఎన్టీఆర్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ ప్రాజెక్టు జనవరి నెలలో ప్రారంభం కానుందని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడి వివరాలు ఇంకా తెలియరాలేవు. కానీ గతకొద్ది రోజులుగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ కు శివ ఓ స్టోరీ వినిపించాడని, ఆ స్టోరీ నచ్చడంతో శివకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని సినీవర్గాల సమాచారం.

మరి ఈ ప్రాజెక్టునే దిల్ రాజు నిర్మించనున్నాడో లేక వేరే దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా నిర్మిస్తాడో చూడాలి. త్వరలోనే అన్ని వివరాలు దిల్ రాజు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Dil Raju  Upcoming film  Koratala shiva  Movie News  

Other Articles