Jilla Movie Telugu Audio Release

Jilla movie telugu audio release

Jilla Movie Telugu Audio Release, Jilla Movie Trailer Audio Release, Jilla Movie news, Jilla Movie updates, Jilla Movie stills, Jilla Movie updates, Jilla Movie trailer, Jilla Movie

Jilla Movie Telugu Audio Release: Vijay Jilla movie telugu version audio released. Kajal agarwal heroine. Malayalam star hero mohan lal acts in important role.

విజయ్ జిల్లా తెలుగు పాటలు, ట్రైలర్ విడుదల

Posted: 06/22/2015 10:34 AM IST
Jilla movie telugu audio release

విజయ్, మోహన్ లాల్ ప్రధాన పాత్రలలో తమిళంలో ఘనవిజయం సాధించిన ‘జిల్లా’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకొని, కలెక్షన్ల వర్షం కురిపించింది.

అయితే ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించాలని గతకొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు తెలుగు వర్షెన్ సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో జరిపారు. తెలుగులో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లో ఆర్.బి.చౌదరి అందిస్తున్నారు.

మరి పాటలతో పాటుగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. మరి ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jilla  trailer  audio release  stills  

Other Articles