Peepli Live' co-director Mahmood Farooqui arrested on rape charges

Peepli live co director arrested on rape charges

peepli live co director arrested on rape charges, Peepli Live, co-director, Mahmood Farooqui, arrest, rape charges, US based Indian origin, research scholar, remand,

Peepli Live' co-director Mahmood Farooqui has been arrested and sent to jail on charges of raping a US-based Indian origin research scholar here.

బాలీవుడ్ కో డైరెర్టర్ పై లైంగిక వేధింపుల కేసు, అరెస్టు

Posted: 06/21/2015 07:48 PM IST
Peepli live co director arrested on rape charges

కామెడితో పాటు ఆత్మహత్యలు ప్రధనాంగా చేసుకుని వచ్చిన పీప్లీ లైవ్ చిత్రానికి కో డైరెక్టర్ గా వ్యవహరించిన మహ్మద్ ఫారుకీని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా మహిళపై అత్యాచారం ఆరోపణలతో మహ్మద్ ఫారూఖీ‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ ఏడాది మార్చి 28న ఓ అమెరికా జాతీయురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసులు ఆయనపై జూన్ 19న కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
 
రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ నిర్మించిన ఈ వ్యంగ్య చిత్రానికి అమీర్ ఖాన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. కాగా, కొలంబియా యూనివర్శిటీలో పీహెచ్‌డీ చేస్తున్న సదరు అమెరికా మహిళ భారత్ వచ్చిన సమయంలో ఆమెపై ఫారూఖీ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్టు చేసిన ఫారూఖీని న్యాయస్థానంలో హాజరుపర్చగా, జూలై 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ సంఘటన బాలీవుడ్‌లో కలకలం రేపింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : peepli live  co director  mahmood farooqui  arrest  

Other Articles